మురళీధరన్, నన్ను చంపొద్దని వేడుకున్నాడు, కానీ ఆ తర్వాత... - పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్

First Published Jul 13, 2021, 3:23 PM IST

150+ కి.మీల వేగంతో బంతులు విసురుతూ అరవీర భయంకర బ్యాట్స్‌మెన్లను కూడా ఇబ్బందులు పెట్టేవాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. ఇంగ్లాండ్‌పై 2003లో 161.3 కి.మీ.ల వేగంతో బంతి విసిరి, రికార్డు కూడా క్రియేట్ చేశాడు...

‘రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌’గా గుర్తింపు దక్కించుకున్న షోయబ్ అక్తర్, ఏ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడేవాడో తెలుసా... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా... వీళ్లెవరూ కాదు... శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్...
undefined
అవును... టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేసిన షోయబ్ అక్తర్, ఓ స్పిన్ బౌలర్‌కి బౌలింగ్ చేయడానికి బాగా ఇబ్బందిపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు అక్తర్...
undefined
‘నేను బౌలింగ్ చేసినవారిలో ముత్తయ్య మురళీధరన్, చాలా టఫెస్ట్ బ్యాట్స్‌మెన్. నేను జోక్ చేయడం లేదు. నిజమే... ఎందుకంటే అతను నన్ను చంపొద్దని వేడుకున్నాడు...
undefined
నేను బౌన్సర్ వేస్తే, అది తగిలి తాను చనిపోతానని, దయచేసి అలాంటి బాల్స్ వేయొద్దని కోరాడు. ‘‘దయచేసి నాకు బౌన్సర్లు వేయకు, మామూలు బాల్స్ వెయ్యి. నేను నా వికెట్ ఇచ్చేస్తాను...’’ అని చెప్పాడు...
undefined
రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని... నేను సాధారణంగా బాల్స్ వేసేవాడిని. వాటిని అతను బౌండరీకి తరలించేవాడు. బౌండరీ కొట్టిన తర్వాత అనుకోకుండా తగిలేసిందని, కొట్టాలని అనుకోలేదని చెప్పేవాడు...’ అంటూ అసలు విషయం బయటపెట్టాడు షోయబ్ అక్తర్...
undefined
అంతర్జాతీయ కెరీర్‌లో 444 వికెట్లు తీసిన షోయబ్ అక్తర్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోపై కూడా కామెంట్ చేశాడు. ‘జానీ బెయిర్‌స్టో చాలా ఓవర్‌ రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతనికి సరైన టెక్నిక్ లేదు. ఏదో లక్కీగా ఆడేస్తున్నాడు’ అంటూ చెప్పాడు షోయబ్ అక్తర్...
undefined
ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు తీయగా, వన్డేల్లో 534, టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా టెస్టుల్లో 1261, వన్డేల్లో 674 పరుగులు చేశాడు మురళీధరన్.
undefined
click me!