టీమిండియాకి డబుల్ డోస్ పూర్తి... తిరిగి బయో బబుల్‌లోకి విరాట్ కోహ్లీ అండ్ టీమ్...

First Published Jul 13, 2021, 2:57 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత జట్టు, కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ కోర్సును పూర్తి చేసుకుంది. ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరే ముందే విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులందరూ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌లో రెండో డోస్ తీసుకుని వ్యాక్సిన్ కోర్సును పూర్తిచేశారు భారత క్రికెటర్లు...

శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వీళ్లంతా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక కావడం వల్ల ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు...
undefined
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఇందుకోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు అందరూ తిరిగి బయో బబుల్‌లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ..
undefined
జూలై 7, 9 తేదీల్లో రెండో డోస్ తీసుకున్న భారత క్రికెటర్లకు జూలై 10న కరోనా పరీక్షలు నిర్వహించింది ఇంగ్లాండ్. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి ముందు కూడా మరోసారి కరోనా పరీక్షల్లో పాల్గొవాల్సి ఉంటుంది...
undefined
ఇంగ్లాండ్‌ కౌంటీల్లో కూడా పాజిటివ్ కేసులు రావడంతో భారత జట్టు కదలికలపై పూర్తి నిఘా పెట్టి, వారి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది భారత క్రికెట్ బోర్డు...
undefined
జూలై 20న ఇంగ్లాండ్‌లో డుర్హమ్‌లో కౌంటీ క్లబ్‌లతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే ఇప్పటిదాకా టీమిండియాతో ఏ కౌంటీ క్లబ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుందనే విషయం ఇంకా కన్ఫార్మ్ కాలేదు...
undefined
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే ఓ కౌంటీ మ్యాచ్ ఆడుతున్నాడు. అతనితో పాటు ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి కూడా కౌంటీ క్రికెట్ ఆడబోతున్నారు..
undefined
click me!