కేన్ గెలిచాడు, మెస్సీ కూడా గెలిచాడు... ఇక మిగిలింది విరాట్ కోహ్లీయే...

First Published Jul 11, 2021, 3:42 PM IST

2021 ఏడాది కొన్ని అద్భుతమైన విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది... సినిమాల్లో ఎన్నో ఏళ్లుగా మంచి కమ్‌బ్యాక్ విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోలు ‘అల్లరి నరేశ్’, రవితేజలకు ‘నాంది’, ‘క్రాక్’ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ ఏడాది క్రీడల్లోనూ ఇలాంటి విజయాలను అందించింది...

2000వ సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో ఏకైక ఐసీసీ టోర్నీ గెలిచిన న్యూజిలాండ్‌కి ఈ ఏడాది... 21 ఏళ్ల తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రూపంలో మరో విజయం దక్కింది...
undefined
2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచుల్లో ఓడిన కేన్ విలియంసన్‌కి ఎట్టకేలకు ఓ మెగా ఫైనల్ టోర్నీ ఫైనల్‌లో విజయం దక్కింది...
undefined
2007 వరల్డ్‌కప్ నుంచి దాదాపు 10 ఐసీసీ టోర్నీలు ఆడుతూ వస్తున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ నిరీక్షణ, డబ్ల్యూటీసీ టైటిల్‌తో తెరపడింది...
undefined
అలాగే ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న అథ్లెట్‌గా టాప్‌లో నిలిచినా... తన కెరీర్‌లో ఒక్క అంతర్జాతీయ టైటిల్ లేదనే లోటు సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీని వెంటాడుతూ వచ్చింది...
undefined
2007, 2015, 2016 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన అర్జెంటీనా... ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత తిరిగి కోపా అమెరికా టైటిల్‌ సాధించింది... మెస్సీ అంతర్జాతీయ టైటిల్ కలను నెరవేర్చింది...
undefined
లియోనెల్ మెస్సీ, కేన్ విలియంసన్‌లాగే ఎన్నో ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు...
undefined
2013 నుంచి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ... ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోతాడా? ఒక్క ఐసీసీ టోర్నీ గెలవకపోతాడా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...
undefined
2014 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్, 2016 ఐపీఎల్ ఫైనల్, 2019 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ రూపంలో విరాట్ కోహ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది...
undefined
అయితే కేన్ విలియంసన్, లియోనెల్ మెస్సీలకు ఎన్నో ఏళ్ల తర్వాత కల నెరవేరినట్టే, ఈ ఏడాది ఐపీఎల్‌లో కానీ, టీ20 వరల్డ్‌కప్‌లో కానీ భారత సారథి విరాట్ కోహ్లీ కల నెరవేరుతుందని ఆశిస్తున్నారు అభిమానులు...
undefined
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలిచినా, గెలవకపోయినా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని గెలిస్తే... భారత జట్టుకి అత్యద్భుత విజయాలు అందించిన కోహ్లీ ఐసీసీ టైటిల్ నెరవేరుతుందని, 130 కోట్ల మంది భారతీయులు కూడా అదే ఆశిస్తున్నారని అంటున్నారు విరాట్ వీరాభిమానులు.
undefined
click me!