IND vs PAK: మీకు మీరే మాకు మేమే..! మీరు ఆసియా కప్‌కు రాకుంటే మేం ప్రపంచకప్‌కు రామంటున్న పాకిస్తాన్

Published : Oct 19, 2022, 10:41 AM IST

BCCI vs PCB: చిరకాల ప్రత్యర్థులు ఇండియా - పాకిస్తాన్ మధ్య  ఈనెల 23న మెల్‌బోర్న్ లో టీ20  ప్రపంచకప్ లో భాగంగా తొలి పోరు జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లతో పాటు  ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ  రెండు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం మరో యుద్ధానికి తెరలేపాయి. 

PREV
17
IND vs PAK: మీకు మీరే మాకు మేమే..! మీరు ఆసియా కప్‌కు రాకుంటే మేం ప్రపంచకప్‌కు రామంటున్న పాకిస్తాన్

ఈనెల 23న మెల్‌బోర్న్ వేదికగా జరుగబోయే ఇండియా-పాకిస్తాన్ పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో  ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కొత్త వివాదానికి తెరలేపాయి. ఒకవైపు ఆస్ట్రేలియా ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి కబుర్లు చెప్పుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే  స్వదేశాలలో  రెండు దేశాల బోర్డు పెద్దలు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. 

27

మంగళవారం బీసీసీఐ సమావేశం తర్వాత  జై షా చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి.  జై షా మాట్లాడుతూ.. వచ్చే ఆసియా కప్ - 2023 లో టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లదు. ఆరు నూరైనా పాకిస్తాన్ గడ్డపై టీమిండియా ఆడదు..  పాకిస్తాన్ లో కాకుండా  న్యూట్రల్ వెన్యూ (భారత్, పాక్ కాకుండా) అయితే ఆలోచిస్తామని  తెలిపాడు. ఈ  వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ లో ఆగ్రహాన్ని కలిగించాయి. 

37

దీంతో వెంటనే పీసీబీ కూడా  కౌంటర్ ఇచ్చింది. మీరు ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ కు రాకుంటే అదే ఏడాది భారత్ లో జరుగబోయే  వన్డే ప్రపంచకప్ ఆడేందుకు మేం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఆ టోర్నీని మేం బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించింది. 

47

పలు జాతీయ మీడియా ఛానెళ్లలో వచ్చిన కథనాల మేరకు.. ‘ఈ విషయంలో (2023లో ఆసియా కప్ పాకిస్తాన్ లో నిర్వహిస్తే భారత్  ఆడకపోవడం గురించి)  కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో వచ్చే లాభనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పీసీబీకి తెలుసు. అయినా సరే మేం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంది..’అని పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. 

57

జై షా ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసిందని.. ఇంకా ఏడాది సమయమున్న  ఆసియా కప్ ఈవెంట్  గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమేముందని పీసీబీ వాపోయింది. పాకిస్తాన్ నుంచి ఆసియా కప్ వేదికను యూఏఈకి మార్చడానికి జై షా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.  ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది ఆసియా కప్ నిర్వహణ పాకిస్తాన్ కు దక్కిందని.. అది అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. 

67

బీసీసీఐ గనక అదే నిర్ణయం మీద కట్టుబడి ఉంటే తాము జై షా అధ్యక్షుడిగా ఉన్న ఏసీసీ నుంచి బయటకు వస్తామని హెచ్చరిస్తూ పీసీబీ కూడా గట్టిగానే కౌంటరిచ్చింది. మరి దీనికి బీసీసీఐ, ఏసీసీ ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 

77

జై షా ప్రకటనపై పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులతో పాటు షాహిద్ అఫ్రిది కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘గత ఏడాది కాలంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య  మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. టీ20 ప్రపంచకప్ లో భారత్-పాక్ మ్యాచ్  కు ముందు బీసీసీఐ సెక్రటరీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. ఇది చూస్తుంటే  భారత్ లో క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ల కొరత ఉన్నట్టు కనిపిస్తున్నది..’ అని ట్వీట్ చేశాడు. 

click me!

Recommended Stories