ధోనీ కానీ, వేరే కెప్టెన్ కానీ సత్తా ఉన్న ప్లేయర్లను బ్యాకప్ చేయడం వల్లే వాళ్లు మ్యాచ్ విన్నర్లుగా మారారు. సూర్య, టీ20ల్లో నెం.1 బ్యాటర్. అతను 5 ఓవర్లు క్రీజులో ఉన్నాడంటే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. అయినా ఓ ప్లేయర్ ఎంపిక, లేదా తొలగించడం గురించి చర్చ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి..