టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిశాక ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్... టీమిండియా షెడ్యూల్ ఖరారు చేసిన జై షా...

Published : Apr 15, 2023, 01:44 PM IST

ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్‌లో యమా బిజీగా ఉన్న భారత క్రికెటర్లు, ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్న విషయం తెలిసిందే. జూన్ మొదటి వారంలో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలబడనుంది టీమిండియా...

PREV
19
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిశాక ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్... టీమిండియా షెడ్యూల్ ఖరారు చేసిన జై షా...

గత సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ ఫైట్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతోంది భారత జట్టు...

29

రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ కూడా టీమ్‌కి దూరంగా ఉన్నారు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా గాయపడ్డాడు. ముగ్గురు కీలక ప్లేయర్లు లేకుండా ఈసారి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది భారత జట్టు..

39

ఇంగ్లాండ్‌లోని లండన్ వేదికగా జరిగే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. ఈ ఏడాది ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కి ప్రాక్టీస్‌గా ఈ సిరీస్‌ని ప్రకటించింది బీసీసీఐ..
 

49
ind vs afg

జూన్ 7న ప్రారంభమయ్యే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, పూర్తిగా ఐదు రోజుల పాటు సాగితే జూన్ 11న ముగుస్తుంది. వర్షం లేదా మరేదైనా కారణంగా ఆటకు అంతరాయం కలిగితే రిజర్వు డే జూన్ 12న ఫలితం వస్తుంది. దీని తర్వాత ఐదు రోజులకు ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ మొదలు అవుతుంది...

59
ind vs afg

రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక కొనసాగుతున్న ట్రెండ్‌ని కొనసాగిస్తూ ఎప్పటిలాగే సీనియర్లకు రెస్ట్ ఇచ్చి, టెస్టు టీమ్‌లో లేని హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ వంటి ఆటగాళ్లతో ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

69

జూన్ 16న ఆష్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. అప్పటికీ బీసీసీఐ మ్యాచుల ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కాంట్రాక్ట్ ముగుస్తుంది. కొత్త బ్రాడ్ కాస్టర్స్‌తో ఒప్పందం అయ్యే వరకూ ఇంటర్మ్ బ్రాండ్‌కాస్టర్‌తో ఈ సిరీస్‌ని ప్రసారం చేస్తారు.
 

79

జూన్ 16న ఆష్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. అప్పటికీ బీసీసీఐ మ్యాచుల ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కాంట్రాక్ట్ ముగుస్తుంది. కొత్త బ్రాడ్ కాస్టర్స్‌తో ఒప్పందం అయ్యే వరకూ ఇంటర్మ్ బ్రాండ్‌కాస్టర్‌తో ఈ సిరీస్‌ని ప్రసారం చేస్తారు.

89
Image credit: PTI

అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2023కి మంచి ఆదరణ దక్కింది. అందుకే దాన్ని మరింత పెంచేందుకు వీలుగా 2024 సీజన్‌లో ఐపీఎల్ మాదిరిగానే హోం, అవే ఫార్మాట్‌లో రూపొందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దీపావళి విండో లేదా ఒకే ఏడాది రెండు సీజన్లు కాకుండా ఐపీఎల్‌కి ఇబ్బంది కలగకుండా వేరే టైం వెతుకున్నాం.. 

99
(PTI Photo/Kunal Patil)(PTI03_20_2023_000389B)

ఉమెన్స్ క్రికెట్‌కి కూడా చాలా మంది అభిమానులు వస్తున్నారు. రోజురోజుకీ ఆ అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అందుకే వచ్చే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని జనాలకు మరింత చేరువ చేసేలా చర్యలు తీసుకుంటాం...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
 

click me!

Recommended Stories