బంగ్లాపై విజయంతో టాప్ 3కి టీమిండియా... మిగిలిన ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిస్తే ఫైనల్‌కి...

First Published Dec 18, 2022, 11:09 AM IST

బంగ్లాదేశ్ పర్యటనలో తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది భారత జట్టు. ఈ గెలుపుతో విజయాల శాతాన్ని మరింత మెరుగుపరుచుకున్న టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది...

ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత జట్టు విజయాల శాతం 55.77గా ఉంది. 12 టెస్టుల్లో 8 విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా, ప్రస్తుతం 75 శాతం విజయాలతో టాప్‌లో ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా.. సఫారీ జట్టుపై విజయం దిశగా సాగుతోంది...

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే మూడో టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. ఇక ఇండియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ మాత్రమే మిగులుతుంది... 

10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని, 60 శాతం విజయాలతో ఉన్న సౌతాఫ్రికా... ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టుల్లో ఓడితే మూడో స్థానానికి పడిపోతుంది. మూడు మ్యాచుల్లోనూ ఓడితే సౌతాఫ్రికా విన్నింగ్ పర్సెంటేజ్ 50కి తక్కువగా పడిపోతుంది...

INDIA

13 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, రెండు టెస్టులను డ్రా చేసుకున్న టీమిండియా... మిగిలిన ఐదు టెస్టుల్లో గెలిస్తే 66కి పైగా విజయాల శాతంతో ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తర్వాత ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఫలితమే టీమిండియా ఫైనల్ ఛాన్సులను డిసైడ్ చేయబోతోంది...

Cricket Australia

నాలుగు టెస్టుల సిరీస్‌ని 4-0 లేదా 3-0, 3-1 తేడాతో గెలిచినా టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే 2-0 తేడాతో టీమిండియా సిరీస్ గెలిచినా, 2-2 తేడాతో సిరీస్ డ్రాగా ముగిసినా... సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ రిజల్ట్ మీద ఆధారపడి ఫైనల్ ఆడే జట్టు నిర్ణయించబడుతుంది...

ఒకవేళ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ని 3-0 ఓడిపోయినా వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులను గెలిస్తే... మళ్లీ ఫైనల్ రేసులోకి దూసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు సౌతాఫ్రికా 53 విజయాల శాతంతో ఉంటుంది...

అసలు ఫైనల్ రేసులో లేని శ్రీలంక, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ రెండు టెస్టుల్లో లంక అద్భుత విజయాలు అందుకుంటే.. 58 శాతం విజయాలతో ఫైనల్ రేసులోకి దూసుకొస్తుంది.

ఇప్పటికీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా, శ్రీలంక... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్టు సిరీస్ ఫలితమే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్లను ఖరారు చేయనుంది.. 

click me!