ఇప్పటికే కివీస్ క్రికెట్ లో వివక్ష, దాని కారణంగా తాను ఎదుర్కున్న సమస్యలపై ఏకరువు పెట్టిన టేలర్.. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ ఓనర్ ఒకరు తనపై చేయి చేసుకున్నట్టు కూడా వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేశాడు. ఇక తాజాగా టేలర్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రావిడ్ ఒక్కడే 4 వేల పులులతో సమానమని, భారత్ లో ప్రజలు అతడిని ఎంతగా ఆరాధిస్తారో తాను స్వయంగా చూశానని పేర్కొన్నాడు.