SRH : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అభిషేక్ శర్మ 47 బంతుల్లో సెంచరీ బాదాడు. 10 సిక్సర్లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును సమం చేస్తూ పలు ఘనతలు సాధించాడు. అభిషేక్ సునామీ బ్యాటింగ్ తో హైదరాబాద్ స్కోర్ 200 పరుగులు దాటింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 51 బంతుల్లోనే 115 పరుగులు సాధించి, తన సొంత గడ్డపై అభిమానులను మస్తు ట్రీట్ ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.
26
సొంత గడ్డపై సెంచరీతో అభిషేక్ గర్జన
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే అభిషేక్ శర్మకు ఇది కలిసొచ్చింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్, ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. నితీష్ రాణా వేసిన 15వ ఓవర్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే అభిషేక్ తన రెండో ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల ముందే ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం గమనార్హం.
36
విరాట్ కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ
ఈ సెంచరీతో అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరసన నిలిచారు. ఇద్దరి పేరిట ఇప్పుడు 9 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రిస్ గేల్ (22), బాబర్ ఆజం (12) అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే టీ20 కెరీర్‌లో 350 సిక్సర్ల మైలురాయిని కూడా అభిషేక్ ఈ మ్యాచ్‌లోనే దాటేశారు.
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లేలో ట్రావిస్ హెడ్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖేష్ కుమార్ వేసిన మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన ఆయన, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి వంటి మేటి బౌలర్లను సైతం లక్ష్యంగా చేసుకుని భారీ సిక్సర్లు బాదారు. ముఖ్యంగా 11వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో 22 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశారు.
56
కలిసొచ్చిన లైఫ్.. ఆ తర్వాత విధ్వంసం
ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మకు అదృష్టం కూడా తోడైంది. 8.1 ఓవర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చారు. అప్పుడు 49 పరుగుల వద్ద ఉన్న అభిషేక్, ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారారు. అలాగే 13.3 ఓవర్ వద్ద నితీష్ రాణా చేతుల్లో నుంచి బంతి జారిపోవడంతో మరోసారి బతికిపోయారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న ఆయన 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరును 183/2 కు చేర్చారు.
66
హైదరాబాద్ భారీ స్కోరు దిశగా..
అభిషేక్ శర్మ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ట్రావిస్ హెడ్ 37 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ ఇషాన్ కిషన్ 25 పరుగులకు రనౌట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. మ్యాచ్ ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు స్కోరు 200 దాటడం చూస్తుంటే, హైదరాబాద్ ఈ సీజన్‌లో మరో భారీ రికార్డు స్కోరు నమోదు చేసేలా కనిపిస్తోంది.