విరాట్-రోహిత్-గిల్-సూర్యల రికార్డులు బ్రేక్.. వాంఖ‌డేలో అభిషేక్ శర్మ రికార్డులు ఇవే

Published : Feb 02, 2025, 10:04 PM IST

Abhishek Sharma: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిషేక్ వ‌ర్మ సునామీ సెంచరీతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్ల రికార్డులను బద్దలుకొట్టాడు.  

PREV
17
విరాట్-రోహిత్-గిల్-సూర్యల రికార్డులు బ్రేక్.. వాంఖ‌డేలో అభిషేక్ శర్మ రికార్డులు ఇవే
Image Credit: Getty Images

Abhishek Sharma: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శర్మ ఎప్ప‌టికీ గుర్తుండిపోయే నాక్ ఆడాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. 24 ఏళ్ల ఈ యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శర్మ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. 

ఈ మ్యాచ్ లో ఆరంభం నుండి అటాకింగ్ మొద‌లుపెట్టిన అభిషేక్ శ‌ర్మ‌ తుఫాను రీతిలో బ్యాటింగ్ చేశాడు. స్టేడియం మొత్తం హోరెత్తిస్తూ అన్ని వైపులా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడంతో రోహిత్ శర్మ తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత్‌కు రెండో వేగవంతమైన సెంచరీ ప్లేయ‌ర్ గా నిలిచాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ 5 భారీ రికార్డులను బద్దలు కొట్టాడు. ఆ వివ‌రాలు చూస్తే.. 

27
Image Credit: Getty Images

వాంఖ‌డేలో అభిషేక్ శర్మ సునామీ

టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. తొలుత 17 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న అభిషేక్ శ‌ర్మ‌.. ఆ తర్వాత 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఓపెనింగ్ కు వచ్చిన ఈ యంగ్ బ్యాట్స్ మెన్ 18వ ఓవ‌ర్ వ‌ర‌కు బ్యాటింగ్ చేసి 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 ప‌రుగులు చేసి ఔటయ్యాడు. 

37

వాంఖ‌డేలో అభిషేక్ శ‌ర్మ బ‌ద్ద‌లు కొట్టిన 5 రికార్డులు 

అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు

135 పరుగులు - అభిషేక్ శర్మ vs ఇంగ్లండ్, వాంఖడే 2025
126* పరుగులు - శుభ్‌మన్ గిల్ vs న్యూజిలాండ్, అహ్మదాబాద్ 2023
123* పరుగులు - రుతురాజ్ గైక్వాడ్ vs ఆస్ట్రేలియా, గౌహతి 2023
122* పరుగులు - విరాట్ కోహ్లి vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్*
2 20 పరుగులు vs ఆఫ్ఘనిస్తాన్, బెంగళూరు 2024

47

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు

13 - అభిషేక్ శర్మ vs ఇంగ్లాండ్, వాంఖడే 2025
10 - రోహిత్ శర్మ vs శ్రీలంక, ఇండోర్ 2017
10 - సంజు శాంసన్ vs సౌత్ ఆఫ్రికా, డర్బన్ 2024
10 - తిలక్ వర్మ vs సౌత్ ఆఫ్రికా, జోబర్గ్ 2024

57

టీ20 ఇంటర్నేషనల్‌లో పూర్తి సభ్య జట్లపై వేగవంతమైన సెంచరీ (బంతుల పరంగా)

35 బంతులు - డేవిడ్ మిల్లర్ vs బంగ్లాదేశ్, పోచెఫ్‌స్ట్రూమ్‌  2017
35 బంతులు - రోహిత్ శర్మ vs శ్రీలంక, ఇండోర్ 2017
37 బంతులు - అభిషేక్ శర్మ vs ఇంగ్లాండ్, వాంఖడే 2025
39 బంతులు - జాన్సన్ చార్లెస్ vs సౌతాఫ్రికా, సెంచూరియన్స్ 2023
40 బంతులు - సంజు శాంస‌న్ vs బంగ్లాదేశ్, హైదరాబాద్ 2024

67
Abhishek Sharma

పవర్‌ప్లేలో అత్యధిక ప‌రుగులు చేసిన అభిషేక్ శర్మ 

అభిషేక్ శ‌ర్మ వాంఖడేలో ఇంగ్లాండ్ పై ఆడిన ఇన్నింగ్స్ తో ప‌వ‌ర్ ప్లే లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ 58 పరుగులు చేశాడు. 2023లో త్రివేండ్రంలో ఆస్ట్రేలియాపై ప‌వ‌ర్ ప్లే లో యశస్వి జైస్వాల్ చేసిన 53 పరుగుల రికార్డును అభిషేక్ శ‌ర్మ అధిగ‌మించాడు.

77
Abhishek Sharma, Team India, Cricket

టీ20లో భారత్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచ‌రీ కొట్టిన ప్లేయ‌ర్లు 

12 బంతులు - యువరాజ్ సింగ్ vs ఇంగ్లాండ్, డర్బన్ 2007
17 బంతులు - అభిషేక్ శర్మ vs ఇంగ్లాండ్, వాంఖడే 2025
18 బంతులు - కేఎల్ రాహుల్ vs స్కాట్లాండ్, దుబాయ్ 2021
18 బంతులు - సూర్యకుమార్ యాదవ్ vs సౌతాఫ్రికా, గౌహతి 2022

Read more Photos on
click me!

Recommended Stories