ఇక్కడ పుట్టి ఉన్నా, టీమిండియాకి ఆడేవాడిని కాదేమో... ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

Published : Feb 10, 2022, 01:01 PM IST

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ ఒకడు. ‘మిస్టర్ 360 డిగ్రీస్’ పేరుతెచ్చుకున్న ఏబీడీ, ఐపీఎల్ ద్వారా టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కి మరింత చేరువయ్యాడు...

PREV
19
ఇక్కడ పుట్టి ఉన్నా, టీమిండియాకి ఆడేవాడిని కాదేమో... ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

సౌతాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, దాదాపు 20 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు... ఇందులో 47 సెంచరీలు ఉన్నాయి..

29

ఐపీఎల్‌లో 150కి పైగా మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 11 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు... 

39

మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు...

49

‘ఐపీఎల్ ఆడే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే గత 15 ఏళ్లుగా భారత జనాలు నన్ను ఎంతగానో అభిమానించి, ఆదరించారు...

59

భారతీయులు చూపించిన ప్రేమను నా జీవితంలో మరిచిపోలేను. అయితే ఇక్కడ పెరగడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ పుట్టి ఉన్నా, నా జీవితంలో టీమిండియాకి ఆడే వాడిని కాదేమో...

69

120 కోట్ల మందిలో భారత జట్టులో చోటు దక్కించుకోవడమంటే అంత తేలికయ్యే విషయం కాదు. కచ్ఛితంగా చాలా స్పెషల్ ప్లేయర్ అయ్యి ఉండాలి... ’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...

79

ఏబీడీ చేసిన కామెంట్లపై భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సౌతాఫ్రికాలో పుట్టిన ఏబీడీ లాంటి బయటి ప్లేయర్లు, భారత క్రికెటర్లకు గౌరవం ఇస్తుంటే, ఇక్కడివాళ్లు మాత్రం అవమానిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు...

89

విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, సచిన్ టెండూల్క్ వంటి లెజెండరీ ప్లేయర్లు కూడా అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు..

99

ప్లేయర్‌గా తప్పుకున్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచింగ్ యూనిట్‌లో ఏబీ డివిల్లియర్స్ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది...

click me!

Recommended Stories