బాగా అలిసిపోయాం, అందుకే ఓడాం... టీ20 సిరీస్ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ...

Published : Nov 20, 2021, 03:14 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీకే పరిమితమైన భారత జట్టు, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మొదటి రెండు టీ20ల్లో గెలిచిన రోహిత్ సేన, క్లీన్‌స్వీప్ లక్ష్యంగా మూడో టీ20 ఆడనుంది...

PREV
113
బాగా అలిసిపోయాం, అందుకే ఓడాం... టీ20 సిరీస్ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ...

కోల్‌కత్తాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా, మూడో టీ20లో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి, ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. 

213

ఆరు నెలలుగా బయో బబుల్‌లో గడుపుతున్న టీమిండియా నయా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లకు మూడో టీ20లో రెస్ట్ ఇవ్వబోతున్నట్టు టాక్...

313

అయితే టీ20 సిరీస్ ఓటమిపై న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టిమ్ సౌథీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు... ‘మరీ ఇంత బిజీ షెడ్యూల్ ఉంటే, ఆడడం చాలా కష్టమే. టీ20 వరల్డ్‌ కప్ నుంచి నేరుగా ఇండియాకి వచ్చాం...

413

ఇక్కడి పరిస్థితులకు, వాతావరణానికి అలవాటు పడడానికి కూడా కొంచెం టైం పడుతుంది. వచ్చి రాగానే సిరీస్ ఆడమంటే ఫలితం ఇలాగే ఉంటుంది. ఉప ఖండ పిచ్‌లపై మ్యాచులు ఆడడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది...

513

రెండు మ్యాచుల్లోనూ వాతావరణం మాకు అనుకూలించలేదు. టాస్ ఓడిపోవడం, తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో తేమ వారికి అనుకూలించింది. పొడి బంతితో ప్రాక్టీస్ చేస్తాం, అలాంటిది తడి బంతితో బౌలింగ్ చేయడం కష్టంగా ఉంటుంది..

613

ఈ సిరీస్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన ఇచ్చింది. వారికి కావాల్సినంత సమయం కూడా దొరికింది. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది.. 

713

ప్రారంభంలో వికెట్లు తీసి ఉంటే, భారత జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది. కానీ మొదటి రెండు మ్యాచుల్లోనూ ఆ అవకాశం దొరకలేదు...

813

తొలి మ్యాచ్‌లో ఓడినా, ఆఖరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ని తీసుకెళ్లగలిగాం. కానీ రెండో టీ20లో డెత్ ఓవర్లలో 20-25 పరుగులు చేశాం. అదీకాకుండా రోహిత్, కెఎల్ రాహుల్ భాగస్వామ్యం మా నుంచి మ్యాచ్‌ను దూరం చేసింది...

913

ఆఖరి మ్యాచ్‌లో విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. దేశం పరువు నిలుపుకోవడానికి ఆ మ్యాచ్ గెలవాల్సిన బాధ్యత మాపై ఉంది...

1013

జనాలతో నిండిన స్టేడియంలో మ్యాచులు ఆడడం ఎప్పుడూ మజాగా ఉంది. ఇండియాలో క్రికెట్‌ క్రేజ్ బాగా ఎంజాయ్ చేస్తా. ఈ టూర్‌ని విజయంతో ముగించాలని అనుకుంటున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ...

1113

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో ఫైనల్‌కి చేరిన న్యూజిలాండ్ జట్టు, ఆ మ్యాచ్ ఆడిన రెండు రోజులకే టీమిండియాతో కలిసి టీ20 సిరీస్ ఆడింది. యూఏఈ నుంచి ఇండియాకి చేరుకుని, ఒక్కరోజు కూడా సరైన ప్రాక్టీస్ లేకుండానే టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి వచ్చింది...

1213

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత ఇండియాతో టీ20 సిరీస్‌కి విశ్రాంతి తీసుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, బౌలర్ కేల్ జెమ్మీసన్... టెస్టు సిరీస్ నుంచి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు...

1313

నవంబర్ 21న ఈడెన్ గార్డెన్స్‌లో న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్ ఆడే భారత జట్టు, నవంబర్ 25న కాన్పూర్‌లో మొదటి టెస్టు, డిసెంబర్ 3న ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు ఆడనుంది. 

click me!

Recommended Stories