సచిన్ కంటే మావాళ్లే గ్రేట్, ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్... విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్...

First Published Nov 20, 2021, 4:23 PM IST

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వన్డే, టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌కి ఆల్‌టైం గ్రేట్ టెస్టు ఎలెవన్‌లో చోటు కల్పించలేకపోయాడు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్...

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో పాటు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు జాసన్ హోల్డర్. వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్టుల్లో 8586 పరుగులు చేశాడు. ఇందులో రెండు త్రిబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

క్రిస్ గేల్ ఇప్పటిదాకా 103 టెస్టుల్లో 15 సెంచరీలతో 7214 పరుగులు చేశాడు. గేల్ అత్యధిక స్కోరు 333 పరుగులు. క్రిస్ గేల్‌కి కూడా రెండు త్రిబుల్ సెంచరీలు ఉన్నాయి. 

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను తన ఆల్‌టైం బెస్ట్ టెస్టు జట్టులో వన్‌డౌన్ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు జాసన్ హోల్డర్. సచిన్‌తో పోటీపడిన రికీ పాంటింగ్, 168 టెస్టుల్లో 13,278 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు ఉన్నాయి...

టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 400 నాటౌట్‌ నమోదుచేసిన విండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారాని టూ డౌన్ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు జాసన్ హోల్డర్...

విండీస్ దిగ్గజం సర్ వీవ్ రిచర్డ్స్, 121 టెస్టుల్లో 24 సెంచరీలతో 8540 పరుగులు చేశాడు. వీవ్ రిచర్డ్స్‌ని ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా తన ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌లో చోటు కల్పించాడు జాసన్ హోల్డర్...

వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌కి జాసన్ హోల్డర్ టీమ్‌లో చోటు దక్కింది. 93 టెస్టుల్లో 26 సెంచరీలతో 8032 పరుగులు చేసిన సోబర్స్, 235 వికెట్లు తీసి ఆల్‌టైం గ్రేట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు..

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి కూడా జాసన్ హోల్డర్ ఆల్‌టైం గ్రేట్ టెస్టు టీమ్‌లో చోటు దక్కింది. గిల్‌క్రిస్ట్ తన కెరీర్‌లో 96 టెస్టులు ఆడి 17 సెంచరీలతో 5570 పరుగులు చేశాడు...

ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, తన కెరీర్‌లో 145 టెస్టుల్లో 708 వికెట్లు తీశాడు. షేన్ వార్న్‌కి జాసన్ హోల్డర్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌లో ప్లేస్ దక్కింది...

విండీస్ మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కర్ట్‌లీ అంబ్రోస్ 98 టెస్టుల్లో 405 వికెట్లు పడగొట్టాడు. అంబ్రోస్‌, తన ఫెవరెట్ క్రికెటర్‌గా చెప్పుకునే జాసన్ హోల్డర్‌, తన రోల్ మోడల్‌కి ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌లో స్థానం ఇచ్చాడు...

అలాగే మరో విండీస్ దిగ్గజ బౌలర్ మాల్‌కోమ్ మార్షల్‌కి కూడా జాసన్ హోల్డర్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌లో స్థానం దక్కింది. 81 టెస్టులు ఆడిన మార్షల్, తన కెరీర్‌లో 376 వికెట్లు తీశాడు.

పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌ను కూడా తన ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌కి ఎంపిక చేశాడు జాసన్ హోల్డర్. వసీం అక్రమ్ తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడి 414 వికెట్లు తీశాడు...

ది గ్రేట్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్, 800+ టెస్టు వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, సంగర్కర, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజాలకు జాసన్ హోల్డర్ టీమ్‌లో చోటు దక్కలేదు..

తాను విండీస్ ప్లేయర్ కావడంతో వెస్టిండీస్ క్రికెటర్లే తనకు స్టార్లుగా కనిపిస్తారని స్వయంగా ప్రకటించిన జాసన్ హోల్డర్, తన ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్‌లో ఏకంగా ఆరుగురు విండీస్ ప్లేయర్లకు చోటు కల్పించాడు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, భారత్, పాక్ నుంచి ఒక్కో ప్లేయర్‌కి తన టీమ్‌లో ప్లేస్ ఇచ్చాడు హోల్డర్.

జాసన్ హోల్డర్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్: క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా, వీవ్ రిచర్డ్స్, గార్‌ఫీల్డ్ సోబర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, కర్ట్‌లీ ఆంబ్రోస్, మాల్‌కోమ్ మార్షల్, వసీం అక్రమ్

click me!