ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత కూడా వరుస సిరీస్‌లతో బిజీ బిజీ క్రికెట్ ఆడనుంది భారత జట్టు. సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది బీసీసీఐ...
గత ఏడాది చివర్లో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది భారత జట్టు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ టూర్‌లో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు...
210
తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత జూన్ 2022లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20 మ్యాచుల సిరీస్ నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ..
310
జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఇండియా - సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ కటక్ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత రెండో టీ20 వైజాగ్ వేదికగా జరగబోతోంది...
410
నిజానికి మొదట ఈ రెండు మ్యాచ్‌లను బెంగళూరు, నాగ్‌పూర్ వేదికల్లో నిర్వహించాలని భావించింది బీసీసీఐ. అయితే కరోనా కారణంగా ఈ వేదికల్లో జరగాల్సిన ఇండియా- వెస్టిండీస్ మ్యాచులు... లక్నో వేదికగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..
510
ఆ తర్వాత మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచులు వరుసగా ఢిల్లీ, రాజ్‌కోట్, చెన్నై వేదికల్లో జరగబోతున్నాయి....
610
జూన్ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్, 16 వరకూ జరుగుతుంది. ఆ తర్వాత ఐదో టెస్టు మ్యాచ్, వైట్ బాల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్తుంది టీమిండియా...
710
మాంచెస్టర్ వేదికగా గత ఏడాది సెప్టంబర్‌లో జరగాల్సిన ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
810
ఇప్పటికే జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో భారత జట్టు, ఐదో టెస్టు మ్యాచును రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడనుంది...
910
ఈ మ్యాచ్ ఓడితే సిరీస్ 2-2 తేడాతో సమం అవుతుంది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో విదేశాల్లో ఆడే మొట్టమొదట టెస్టు కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి...
1010
ఈ టెస్టులో గెలిస్తే 3-1 తేడాతో భారత జట్టు టెస్టు సిరీస్ గెలుస్తుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది టీమిండియా...