ఇప్పటి వరకు నేపాల్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (314), అత్యధిక సిక్సర్లు (26) కొట్టిన రికార్డును కలిగి ఉంది. దానిని జింబాబ్వే బ్రేక్ చేసింది. ప్రతిగా గాంబియా 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే టీ20లలో అతిపెద్ద విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది.
నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ మైదానం బుధవారం ఈ క్రికెట్ చరిత్రకు సాక్షిగా నిలిచిన జింబాబ్వే తొలి బంతి నుంచే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టీమ్ కేవలం 3.2 ఓవర్లలో యాభై పరుగులు సాధించింది. కేవలం 13 బంతుల్లోనే తాడివానాశే మారుమణి వేగంగా పరుగులు సాధించాడు. పవర్‌ప్లే పూర్తికాకముందే జట్టు వందకు చేరుకుంది.