టీ20, వన్డేల్లో ఫామ్‌ని తిరిగి అందుకున్నా టెస్టుల్లో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. 2020 ఏడాది ఆరంభంలో 58కి పైగా ఉన్న విరాట్ కోహ్లీ టెస్టు సగటు ఇప్పుడు 48కి పడిపోయింది. మూడేళ్ల క్రితం టెస్టుల్లో హాఫ్ సెంచరీల కంటే ఎక్కువగా సెంచరీలు చేసిన కోహ్లీ... ఇప్పుడు ఆ రికార్డు కూడా కోల్పోయాడు...