స్లిమ్‌గా ఉండాలంటే ఫ్యాషన్ షోలకు వెళ్లి, మోడల్స్‌ని పట్టుకురండి... సెలక్టర్లపై సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Jan 20, 2023, 9:53 AM IST

టీమిండియా ఆడాలంటే ఒకటి ఫిట్‌నెస్, రెండోది లక్! అవును... ఈ రెండూ ఉంటే టాలెంట్‌ పెద్దగా లేకపోయినా టీమ్‌లో చోటు దొరుకుతుంది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న ఎంతో మంది క్రికెటర్లు, టాలెంట్ పుష్కలంగా ఉన్నా కూసింత లక్, సరైన ఫిట్‌నెస్ లేక వెలుగులోకి రాలేకపోతున్నారు...

శతాబ్దల ఘనమైన చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో రికార్డులను ఊచకోత కోస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. గత రెండు సీజన్లలో కలిపి దాదాపు 2 వేల పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, ఈ సీజన్‌లో తన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. అయినా అతనిపై కరుణ చూపించడం లేదు సెలక్టర్లు...

ఫస్ట్ క్లాస్ క్రికెట్ సగటులో ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌కి దగ్గరగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్, టీమిండియాకి మాత్రం చాలా దూరంగా ఉన్నాడు. కారణం అతని ఫిట్‌నెసే... సర్ఫరాజ్ ఖాన్‌ని చూస్తేనే... అతని భారీ ఖాయం, ఓవర్ వెయిట్ ఉన్నట్టు తెలిసిపోతోంది...

Sarfaraz Khan

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్‌లో అదరగొట్టడంతో పాటు బీసీసీఐ నిర్వహించే యో-యో పరీక్షల్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. రంజీల్లో అదరగొట్టే సర్ఫరాజ్ ఖాన్‌కి ఈ రెండూ కష్టమే. ఐపీఎల్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి తుది జట్టులో చోటు దక్కడమే చాలా అరుదు...

Image credit: BCCI

అయితే పర్ఫామెన్స్ కంటే ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ‘స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండేవాళ్లే కావాలనుకుంటే వెళ్లి ఫ్యాషన్ షోలల్లో వెతకండి. కొందరు మోడల్స్‌ని పట్టుకురండి.. వాళ్లకి బ్యాట్ ఇచ్చి ఆడమనండి...
 

క్రికెట్‌ టీమ్‌ని నడిపించడం అలా కాదు. క్రికెటర్లు బక్కగా ఉంటారు, లావుగా ఉంటారు. ఆటకి వారి శరీర సైజులకి సంబంధం లేదు. సైజ్ చూడకుండా అతను చేస్తున్న పరుగులు చూడండి. తీస్తున్న వికెట్లు చూడండి. అప్పుడే టీమిండియా బాగు పడుతుంది...
 

sarfaraz khan

సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా ఆడడానికి కావాల్సినంత ఫిట్‌గా ఉన్నాడు. రంజీ ట్రోఫీల్లో వరుసగా సెంచరీలు కొడుతున్నాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అతను ఫిట్‌గా ఉన్నాడని చెప్పడానికి ఇంకేం చేయాలి. ఫిట్‌గా లేకపోతే ఇన్ని సెంచరీలు చేయలేడు...

టీమిండియాకి ఆడడానికి యో-యో టెస్టు పాస్ కావడం మాత్రమే ప్రామాణికం కాదు. క్రికెటర్‌ ఫిట్‌గా ఉన్నాడా లేడా అని తేల్చే ఓ పరీక్ష మాత్రమే. అలెడ్రీ ఫిట్‌గా ఉన్నాడని పరుగులు చేస్తూ నిరూపించుకున్నాక ఈ టెస్టుతో పనేంటి?’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!