నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహించే నేతలు సెంటిమెంట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
undefined
ఈ నియోజకవర్గం నుండి ఏడుదఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన జానారెడ్డి ఇంకా ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. దివంగత నోముల నర్సింహ్మయ్య కూడ జానారెడ్డి బాటలోనే పయనించారు. తండ్రి బాటలోనే నోముల భగత్ పయనిస్తున్నారు.
undefined
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.
undefined
ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న జానారెడ్డి నిడమనూరు మండలంలోని అభంగపూర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
undefined
1978 నుండి ఆయన ప్రతిసారీ ఎన్నికల ప్రచారాన్ని ఇదే గ్రామం నుండి ప్రారంభిస్తారు.
undefined
నాగార్జునసాగర్ లోని సత్యనారాయణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటు అల్వాల్ ఆంజనేయస్వామి ఆలయంలో కూడ ఆయన పూజలు చేశారు. ఈ పూజలు నిర్వహించిన తర్వాత ఈ నెల 29న ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
undefined
2014 ఎన్నికలకు ముందు నోముల నర్సింహ్మయ్య సీపీఎం నుండి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరిన నోముల నర్సింహ్మయ్యకు నాగార్జునసాగర్ సీటును కేటాయించింది టీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుండి పోటీ చేసిన నోముల నర్సింహ్మయ్య ఓటమి పాలయ్యాడు
undefined
2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆయన జానారెడ్డిపై విజయం సాధించారు.
undefined
2014 ఎన్నికల సమయంలోనూ, 2018 ఎన్నికల సమయంలో కూడ నోముల నర్సింహ్మయ్య అభంగపూర్ నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
undefined
నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్ ఈ నెల 30వ తేదీన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన అభంగపూర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. తండ్రి బాటలోనే భగత్ కూడ అభంగపూర్ సెంటిమెంట్ ను నమ్ముతున్నారు.
undefined