కరోనా వైరస్ దేశంలో రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనా సోకిన రోగులను ఎలా కాపాడాలిరా దేవుడా అని.. ప్రభుత్వాలు, వైద్యులు పైనా కిందా పడుతుంటే... వీళ్లు మాత్రం ఆస్పత్రిలో పిచ్చెక్కిస్తున్నారు.
undefined
రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో కొందరు కరోనా రోగులు... తమకు సిగరెట్లు కావాలి.. బీడీలు కావాలంటూ ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని విసిగించారు. అక్కడితో ఆగకుండా నగ్నంగా తిరుగుతూ.. నర్సులను లైంగికంగా వేధించారు. ఇదో పెద్ద సంచలనమే అయ్యింది.
undefined
తాజాగా.. ఇంచుమించు అలాంటి సంఘటనే హైదరాబాద్ లో కూడా చోటుచేసుకుంది. కాకపోతే గాంధీ ఆస్పత్రిలోని కరోనా రోగులు మాత్రం బిర్యానీకావాలి అంటూ నస పెడుతున్నారు.
undefined
వైరస్ సోకిన వారికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిని ప్రతీ క్షణం పరిశీలిస్తూ.. సరైన భోజనం, టాబ్లెట్స్ ఇస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఆస్పత్రి అందజేసే భోజనంపై పెదవి విరుస్తున్నారు. తమకు బిర్యానీ, స్పైసీ ఫుడ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
రోగుల వింత కోరికలను చూసి.. వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. వాళ్ల కోరికలు తీర్చడం మా వాళ్లకావడం లేదంటూ తలలు పట్టుకుంటున్న వైద్యులు చివరకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
undefined
రోగుల డిమాండ్లపై వారికి చికిత్స చేసే జూనియర్ డాక్టర్లు రెండు విధాలుగా స్పందించడం విశేషం. ఐసోలేషన్ వార్డలు రద్దీగా ఉంటాయని.. రోగులు కోరిన కోరికలు తీర్చలేమని కొందరు పేర్కొంటున్నారు.
undefined
మరికొందరు మాత్రం రోగులకు సరైన ప్రొటీన్ ఆహారం అందడం లేదని చెప్పడం గమనార్హం. వాస్తవానికి గాంధీ ఆస్పత్రిలో డైటిషీయన్ లేరు. దీంతో ఏ రోగులకు ఏ ఆహారం అందించాలనే అంశంపై ఆస్పత్రి నిబంధనలు పాటించడం లేదనే విషయం అర్థమౌతోంది.
undefined
నిజానికి రోగులకు మంచి ఆహారమే అందిస్తున్నప్పటికీ... అందులో నాన్ వెజ్ పెట్టకపోవడం వల్లే అసలు సమస్య మొదలైందని తెలుస్తోంది. కూరగాయాల కూరలు పెడుతుంటే.. రోగులు నచ్చడం లేదని తెలుస్తోంది.
undefined
నాకు ఎలాంటి జ్వురం లేదూ.. నీరసంగానూ లేను.. కాబట్టి నాకు మంచి ఆహారం పెట్టండి అంటూ ఓ కరోనా రోగి చెప్పడం గమనార్హం. ఈ విషయంపై రోగులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం.
undefined