తిండిలేక పస్తులు: యాచకుల కడుపునింపిన పోలీసులు

First Published | Apr 3, 2020, 2:41 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్  వ్యాధి నివారణ గురించి ప్రస్తుతం దేశం మొత్తంలో లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెక్కాడితే కానీ డొక్కాడని వారు, యాచకుల పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. 

కరీంనగర్ జిల్లా లక్సెట్టిపేట పోలీసులు పెద్ద మనసు చాటుకున్నారు. పట్టణంలో రోడ్లపై పలు వీధుల్లో యాచకులకు, వృద్ధులకు, అనాధలకు, పేదవారికి, మతిస్థిమితంలేని వారికి, తినడానికి తిండిలేక ఆకలితో తల్లడిల్లుతున్న వారికి భోజనాన్ని అందించారు.
లక్షెట్టిపేట్ సీఐ నారాయణ నాయక్, ఎస్సై దత్తాత్రి గారి ఆధ్వర్యంలో శుక్రవారం 8 మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయించి వారికి వడ్డించి ఆకలి దప్పిక తీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రించడం కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా యచాకులకు, ఏ ఆధారంలేని అనాథలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది చూసిన తాము చలించి భోజన సదుపాయం కల్పించామని, మరికొందరికి త్రాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సంఘటనలు కనిపిస్తే చాలా బాధేస్తుందని నారాయణ్ నాయక్ తెలిపారు. అలాంటి అనాథలు ఎక్కడైనా కనిపిస్తే మానవత్వంతో ముందుకు వచ్చి సహకరించాలని ఆయన దాతలను కోరారు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి నివారణ గురించి ప్రస్తుతం దేశం మొత్తంలో లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెక్కాడితే కానీ డొక్కాడని వారు, యాచకుల పరిస్ధితి ఆందోళనకరంగా మారింది.

Latest Videos

click me!