రూ. 40 వేల జీత‌మున్నా ఈ ల‌గ్జ‌రీ కారుకు ఓన‌ర్ అయిపోవ‌చ్చు.. లుక్‌లోనే కాదు ఫీచ‌ర్ల‌లో కూడా తోపు

Published : Jul 22, 2026, 06:00 PM IST

Hyundai: మైక్రో SUV విభాగంలో హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ మంచి ఆదరణ పొందుతున్న కార్లలో ఒకటి. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు, కుటుంబంతో వీకెండ్ ట్రిప్‌లకు అనువుగా ఉండేలా ఈ కారును రూపొందించారు. ఈ కారులో ఎలాంటి ఫీచ‌ర్లున్నాయి? ధ‌ర ఎంత‌.? ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ధ‌ర ఎంత‌.? ఈఎమ్ఐ ఎంత ప‌డుతుంది.?

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.13 లక్షల నుంచి రూ.11.62 లక్షల వరకు ఉంది. వేరియంట్‌ను బట్టి హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు హ్యుండ‌య్ ఎక్స్‌ట‌ర్ హెచ్ఎక్స్‌2 పెట్రోల్ మ్యాన్యువ‌ల్ వేరియంట్‌కు దాదాపు రూ.1,90,596 డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.5,22,540 మొత్తాన్ని లోన్‌గా పొందవచ్చు. 10 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్ల కాలానికి లోన్ తీసుకుంటే ప్రతి నెల రూ.11,102 EMI చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఐదేళ్లలో రూ.1,43,580 వడ్డీ చెల్లించగా, మొత్తం చెల్లించే మొత్తం రూ.6,66,120 అవుతుంది. డౌన్ పేమెంట్‌ను పెంచితే EMI తగ్గుతుంది. అలాగే లోన్ కాలాన్ని పెంచితే నెలవారీ EMI తగ్గినా, మొత్తం వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే స‌రాస‌రి నెల‌కు రూ. 40 వేలు జీతం వ‌చ్చే వ్య‌క్తి కూడా ఈ కారును సొంతం చేసుకోవ‌చ్చు.

25
ఆకట్టుకునే డిజైన్.. నగరాలకు పర్ఫెక్ట్ SUV

Hyundai Exterను ఆధునిక మైక్రో SUVగా తీర్చిదిద్దారు. బోల్డ్ డిజైన్, స్టైలిష్ ఫ్రంట్ లుక్, ఎత్తైన బాడీ కారణంగా ఇది రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. 3,830 మిల్లీమీటర్ల పొడవు, 1,723 మిల్లీమీటర్ల వెడల్పు, 1,643 మిల్లీమీటర్ల ఎత్తుతో నగరాల్లో డ్రైవ్ చేయడానికి అనువైన పరిమాణంలో ఉంటుంది. సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. బై-ఫంక్షన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటి ఫీచర్లు ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చాయి.

35
కంఫర్ట్, టెక్నాలజీతో నిండిన ఇంటీరియర్

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌లోని క్యాబిన్ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఎక్కువసేపు ప్రయాణించినా అలసట లేకుండా ఉండేలా సీట్లు, ఇంటీరియర్ డిజైన్‌ను తయారు చేశారు. ఫుట్‌వెల్ లైటింగ్, మెటల్ పెడల్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. అలెక్సా ద్వారా హోమ్ టూ కార్ (H2C) సపోర్ట్, 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 300కు పైగా వాయిస్ కమాండ్లు వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఈ కారులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

45
సేఫ్టీ విషయంలో మంచి ప్రాధాన్యం

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కంపెనీ ఈ కారులో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు 45కు పైగా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, బలమైన బాడీ స్ట్రక్చర్ వంటి ఫీచర్లు డ్రైవర్‌తో పాటు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. నగర ట్రాఫిక్‌లోనే కాకుండా హైవే ప్రయాణాల్లో కూడా నమ్మకంగా డ్రైవ్ చేసేలా ఈ కారును రూపొందించారు.

55
ఇంజ‌న్ ఆప్ష‌న్స్

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌లో 4 సిలిండర్ స్ట్రైట్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. పెట్రోల్ వేరియంట్‌తో పాటు Hy-CNG Duo టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 37 లీటర్లు కాగా, CNG వేరియంట్‌లో 37 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌తో పాటు 60 లీటర్ల వాటర్ ఈక్వివలెంట్ సామర్థ్యం గల డ్యూయల్ CNG సిలిండర్లు ఉంటాయి. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ కారణంగా బూట్ స్పేస్ కూడా ఎక్కువగా లభిస్తుంది. మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు, భద్రత, EMI సౌకర్యం అన్నీ ఒకే కారులో కోరుకునే వారికి Hyundai Exter మంచి ఎంపికగా చెప్పొచ్చు. దాదాపు రూ.1.90 లక్షల డౌన్ పేమెంట్ చేసి, నెలకు సుమారు రూ.11 వేల EMIతో ఈ కారును సొంతం చేసుకునే అవకాశం ఉండటం మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండే అంశంగా చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories