Toyota Hyryder Aero Edition: టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కొత్త లుక్ లో “ఎయిరో ఎడిషన్” లిమిటెడ్ ప్యాకేజ్ విడుదలైంది. స్టైలింగ్ ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ప్రత్యేకంగా ఉన్నాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ ప్రజాదరణ పొందిన ఎస్యూవీ అర్బన్ క్రూజర్ హైరైడర్ కు ఒక కొత్త లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజ్‌ను విడుదల చేసింది. దీనికి “ఎయిరో ఎడిషన్” అని పేరు పెట్టారు. ఇది కొత్త మోడల్ కాకుండా, హైరైడర్‌కి మరింత స్పోర్టీ, ప్రీమియం లుక్ ఇచ్చే ప్రత్యేక స్టైలింగ్ ప్యాకేజ్. ఈ ఎడిషన్‌కు సంబంధించిన ప్రత్యేక యాక్సెసరీస్ రూ.31,999 అదనపు ధరతో అందుబాటులో ఉన్నాయి.
హైరైడర్ ఎస్యూవీ ప్రారంభ ధర ₹10.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎయిరో ఎడిషన్ ప్యాకేజ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టయోటా షోరూమ్‌లలో లభిస్తుంది. ఇది నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంది. అవి వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్.
ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేక డిజైన్ ఫీచర్లు. ఇవి హైరైడర్‌కు రోడ్డుపై మరింత బలమైన ప్రెజెన్స్ ఇస్తాయి.
ఫ్రంట్ స్పాయిలర్: కొత్త ఫ్రంట్ స్పాయిలర్ వాహనానికి మరింత ఆగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది.
రియర్ స్పాయిలర్: ఇది కేవలం లుక్‌కే కాకుండా, ఎయిరోడైనమిక్ ఎఫిషియెన్సీని కూడా పెంచుతుంది.
సైడ్ స్కర్ట్స్: కొత్త డిజైన్ సైడ్ స్కర్ట్స్ వాహనానికి డైనమిక్, లో స్లంగ్ లుక్‌ను ఇస్తాయి.
హైరైడర్‌ను ఇతర కార్ల నుండి ప్రత్యేకంగా చూపించాలనుకునే కస్టమర్లకు ఈ కొత్త స్టైల్ సరైన ఎంపికగా ఉంటుంది.
35
ఇంజిన్ ఆప్షన్లు, పనితీరు ఎలా ఉంటుంది?
టయోటా హైరైడర్ రెండు ప్రధాన పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది.
1. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్: ఇది ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ సిస్టమ్‌లో కారు సుమారు 40% దూరం, 60% సమయం వరకు ఎలక్ట్రిక్ పవర్‌పై నడుస్తుంది. ఇంధన సామర్థ్యం లీటరుకు 27.97 కిమీ వరకు ఉంటుంది.
2. నియో డ్రైవ్ (1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్): ఈ వేరియంట్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఉన్నాయి. కొన్ని మోడళ్లలో 2WD, 4WD సిస్టమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
హైరైడర్‌లో సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది, దీంతో ఇది విభిన్న అప్షన్లు కోరుకునే వినియోగదారుల అవసరాలకు సరిపోతుంది.
హైరైడర్ ఇంటీరియర్ పూర్తిగా కంఫర్ట్, టెక్నాలజీ, ప్రీమియం అనుభూతిని అందించేలా రూపొందించారు.
వెంటిలేటెడ్ లెదర్ సీట్స్: వేడి వాతావరణంలో కూడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి ఉంటుంది.
పనోరామిక్ సన్‌రూఫ్: కేబిన్‌ను హాయిగా, విస్తృతంగా అనిపించేలా చేస్తుంది.
9-అంగుళాల టచ్‌స్క్రీన్: వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంటుంది.
వైరలెస్ చార్జింగ్, 360° కెమెరా, అంబియెంట్ లైటింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
అలాగే, రియర్ ఏసీ వెంట్స్, రిక్లైనింగ్ సీట్లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ కూడా ఉన్నాయి.
55
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరలు, వేరియంట్లు
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను మొత్తం 21 వేరియంట్లలో అందిస్తున్నారు. ఇవి ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, ఫ్యూయల్ టైప్ (పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్జీ) ఆధారంగా విభజించారు. వివిధ వేరియంట్లను బట్టి ధరలు ₹10.99 లక్షల నుంచి ₹19.76 లక్షల వరకు ఉన్నాయి.
టయోటా హైరైడర్‌కు 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వరకు ప్రాథమిక వారంటీ ఉంది, దీన్ని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్ష కిమీ వరకు పొడిగించుకోవచ్చు. అదనంగా, హైబ్రిడ్ బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్ష కిమీ వరకు ప్రత్యేక వారంటీ అందుబాటులో ఉంది. ఈ ఎయిరో ఎడిషన్ ప్యాకేజ్‌తో హైరైడర్ మరింత స్పోర్టీ, ప్రీమియం లుక్‌ను పొందింది.