EV Car: చేతిలో రూ. 40 వేలు ఉంటే చాలు ఈ ఎల‌క్ట్రిక్‌ కారు మీ సొంతం.. నెల‌కు ఎంత EMI చెల్లించాలంటే..

Published : Jul 21, 2025, 02:16 PM IST

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరుగుతోంది. దీంతో దాదాపు అన్ని టాప్ ఆటో మొబైల్ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను లాంచ్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక బెస్ట్ ఎల‌క్ట్రిక్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
టాప్ పంచ్

ఇటీవల భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికమవ్వడం, పర్యావరణ ప్రయాణాలపై ప్రజల్లో చైతన్యం పెరగడం ఇందుకు ముఖ్య కారణాలుగా చెప్పొచ్చు. అలాగే ప్ర‌భుత్వాలు సైతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సీడీలు అందిస్తుండ‌డం వ‌ల్ల కూడా ఈ వాహ‌నాల అమ్మ‌కాలు పెరుగుతున్నాయి. 

ఈ మారుతున్న ట్రెండ్‌ను అర్థం చేసుకున్న టాటా మోటార్స్ ఎన్నో హైబ్రిడ్, పూర్తిస్థాయి EVలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. వాటిలోనే ఒకటి టాటా పంచ్ EV. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
టాటా పంచ్ EV ధర, EMI

టాటా పంచ్ EV ప్రారంభ మోడల్‌ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 10.45 లక్షలుగా ఉంది. మీరు ఈ కారును రూ. 40,000 డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవ‌చ్చు. మిగ‌తా మొత్తాన్ని ఫైనాన్స్ చేసుకోవ‌చ్చు. 9.8% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెల‌కు సుమారు రూ. 25,395 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది మీ వ్య‌క్తిగ‌త క్రెడిట్ స్కోర్‌తో పాటు మీరు కారు కొనుగోలు చేస్తున్న డీల‌ర్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

35
పవర్‌ఫుల్ బ్యాటరీ, శక్తివంతమైన పనితీరు

ఈ ఎలక్ట్రిక్ SUVలో 25 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 315 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక ఈ కారు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.

45
ఛార్జింగ్‌కు ఎంత స‌మ‌యం ప‌డుతుంది.?

ఈ కారును ఛార్జ్ చేయడం చాలా సులభం. మీరు ఎంచుకునే ఛార్జర్ ఆధారంగా బ్యాట‌రీ ఫుల్ టైమ్ మారుతుంది.

AC ఛార్జర్ (3.3kW)తో 10% నుంచి 100% వరకూ ఛార్జ్ అయ్యేందుకు 3.6 గంటలు పడుతుంది. అలాగే DC ఫాస్ట్ ఛార్జర్ 10% నుంచి 80% వరకూ ఛార్జ్ కావడానికి కేవలం 56 నిమిషాలు మాత్రమే. ఇది రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్ ఛార్జింగ్ ఆప్షన్లను అందిస్తోంది.

55
అదిరిపోయే ఫీచర్లు

టాటా పంచ్ ఈవీలో 366 లీటర్ల బూట్ స్పేస్ ను ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ 190 ఎమ్ఎమ్ గా ఉంది. అలాగే ఇందులో పవర్ స్టీరింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, పాసింజర్ ఎయిర్ బ్యాగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందించారు. అలాగే ఈ కారును అలాయ్ వీల్స్ తో తీసుకొచ్చారు. రెయిన్ సెన్సింగ్ వైపర్, రెయిర్ విండో వైపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories