Maruti Brezza: చేతిలో రూపాయి లేకున్నా ఈ కారు సొంతం చేసుకోవచ్చు.. నెల‌కు EMI ఎంతంటే..

Published : Jul 11, 2025, 05:52 PM IST

కారు కొనుగోలు చేయాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అయితే భారీగా డౌన్‌పేమెంట్ చెల్లింలేక ఆ ఆలోచ‌న విర‌మించుకుంటారు. అయితే ప్ర‌స్తుతం జీరో డౌన్‌పేమెంట్స్‌కి కూడా కార్ల‌ను అందిస్తున్నాయి సంస్థ‌లు. అలాంటి ఒక కారు గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు బెస్ట్ ఎస్‌యూవీ

మారుతి బ్రీజా 2025 మిడ్ రేంజ్ వేరియంట్ ఎస్‌యూవీ కార్ల‌లో ఒక‌టిగా నిలుస్తోంది. స్టైలిష్ లుక్‌, అదిరిపోయే మైలేజ్‌, మంచి ఫీచ‌ర్ల‌తో తీసుకొచ్చిన ఈ కారును తెగ కొనేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కారులో ఇంజ‌న్‌, ఇంటీరియర్, ఫీచర్లు అన్నీ ప్రీమియం రేంజ్‌లో ఉన్నాయి.

25
జీరో డౌన్ పేమెంట్

మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఈ కారును రూపాయి చెల్లించ‌కుండా కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు జీరో డౌన్‌పేమెంట్‌కి ఈ కారును సొంతం చేసుకునే అవవ‌కాశం క‌ల్పించాయి. కార్ దేఖో వెబ్‌సైట్ ప్ర‌కారం ఈ కారు ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ధ‌ర రూ. 9.73 ల‌క్ష‌లుగా ఉంది. జీరో డౌన్‌పేమెంట్‌తో 7 ఏళ్ల‌కు గాను నెల‌కు రూ. 16 వేల ఈఎమ్ఐ చెల్లిస్తే స‌రిపోతుంది.

35
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

మారుతి బ్రీజా 2025లో 1.5 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 103 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యానువ‌ల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మైలేజ్ విష‌యానికొస్తే పెట్రోల్ మ్యానువ‌ల్ లీట‌ర్‌కు 20.15, ఆటోమేటిక్ వేరియంట్ 19.8 కిలోమీట‌ర్లు, సీఎన్‌జీ కేజీకి 34.5 కిలోమీట‌ర్ల మైలేజ్ ఇస్తుంది.

45
వావ్ అనిపించే ఇంటీరియ‌ర్

Maruti Brezza 2025లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ప్ర‌ధానంగా 9 ఇంచెస్‌తో కూడిన స్మార్ట్‌ప్లే ప్రో ట‌చ్ స్క్రీన్‌, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, అంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు.

55
భ‌ద్ర‌త విష‌యంలో కూడా

ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్టెంట్, ISOFIX చైల్డ్ మౌంట్స్ వంటి అత్యుత్తమ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. రియర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్‌తో డ్రైవింగ్ మరింత సురక్షితం అవుతుంది. ధ‌ర విష‌యానికొస్తే ఈ కారు ప్రారంభ వేరియంట్ ధ‌ర రూ. 8.29 ల‌క్షలుగా ఉండగా టాప్ వేరియంట్ ధ‌ర రూ. 13.99 ల‌క్ష‌లుగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories