MG hector facelift: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌గ్జ‌రీ కారు.. అందుబాటు ధ‌ర‌లో MG హెక్ట‌ర్ కొత్త కారు

Published : Dec 16, 2025, 11:13 AM IST

MG hector facelift: భార‌త మార్కెట్లో MG హెక్టర్ కంపెనీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌గ్జ‌రీకి పెట్టింది పేరైన ఈ కంపెనీ తాజాగా మిడ్ రేంజ్ వేరియంట్‌లో కొత్త కారును తీసుకొచ్చింది.  

PREV
15
ధర, వేరియంట్లు

JSW MG మోటార్ ఇండియా తాజా అప్‌డేట్‌తో MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ SUV ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం ఇది పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ సమాచారం ప్రకారం వచ్చే ఏడాది డీజిల్ వేరియంట్లు కూడా రానున్నాయి. ఈ కొత్త కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, మహింద్రా XUV700 వంటి పాపులర్ SUVలకు గట్టి పోటీ ఇస్తోంది.

25
ఎక్స్‌టీరియర్‌లో కొత్త లుక్

ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త ఫ్రంట్ డిజైన్. ఇందులో లౌవర్‌లతో కూడిన క్రోమ్ ఫినిష్ గ్రిల్ ఇచ్చారు. దీనికి కంపెనీ “ఆరా హెక్స్ గ్రిల్” అనే పేరు పెట్టింది. ముందు బంపర్‌ను రీడిజైన్ చేసి, సిల్వర్ సరౌండ్‌తో పెద్ద సెంట్రల్ ఎయిర్ వెంట్ ఇచ్చారు. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు SUV మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.

35
సైడ్, రియర్ మార్పులు

సైడ్ ప్రొఫైల్‌లో కొత్తగా 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ అందించారు. బాడీ షేప్‌లో పెద్ద మార్పులు లేవు. వెనుక భాగంలో రీడిజైన్ చేసిన బంపర్ మాత్రమే కనిపిస్తుంది. అదనంగా కొత్త బ్లూ కలర్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేశారు.

45
ఇంటీరియర్ కలర్ స్కీమ్, ఫీచర్ అప్‌డేట్

క్యాబిన్‌లో పెద్ద మార్పు కొత్త డ్యూయల్-టోన్ కలర్ థీమ్. టాప్ వేరియంట్‌లో బీజ్-బ్లాక్ కలర్ స్కీమ్ అందిస్తున్నారు. మిగతా ఇంటీరియర్ ఎలిమెంట్స్ మునుపటి మోడల్ తరహాలోనే ఉన్నాయి. ఫీచర్లలో ప్రధాన అప్‌డేట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్. స్క్రీన్ సైజ్ మారలేదు. అయితే మల్టీ-ఫింగర్ స్వైప్ సపోర్ట్ జోడించారు. రెండు వేళ్లతో ఎయిర్ కండిషనింగ్ నియంత్రించవచ్చు. మూడు వేళ్లతో పాటలు మార్చుకోవచ్చు లేదా బ్రైట్‌నెస్ సెట్ చేయవచ్చు. RAM అప్‌గ్రేడ్ వల్ల స్క్రీన్ రెస్పాన్స్‌ మెరుగైంది. 360 డిగ్రీ కెమెరాలో కొత్త “వీల్ వ్యూ” ఫీచర్ కూడా అందించారు.

55
ఇంజిన్, భవిష్యత్ ప్లాన్

మెకానికల్ పరంగా పెద్ద మార్పులు లేవు. 2026 MG హెక్టర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. డీజిల్ వేరియంట్ వివరాలను కంపెనీ ప్రస్తుతం వెల్లడించలేదు. 5 సీటర్, 7 సీటర్ లేఅవుట్‌లలో పెట్రోల్ మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 6 సీటర్ వెర్షన్ కూడా 2026లో రావచ్చని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories