Maruti Ertiga: ఫ్యామిలీ మొత్తం సౌకర్యవంతంగా ప్రయాణించాలనుకునే వారికి మారుతి ఎర్టిగా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కారు కొనుగోలు చేయడానికి ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి.? ఈఎమ్ఐ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీఎస్టీ తగ్గింపు తర్వాత మారుతి సుజుకి ఎర్టిగా ధరలు భారీగా తగ్గాయి.
బేస్ మోడల్ (LXI Petrol): రూ. 8.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాప్ మోడల్: రూ. 12.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇక ఈ కారు ఢిల్లీలో ఆన్-రోడ్ ధర (RTO, ఇన్సూరెన్స్‌తో కలిపి) సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుంది. అంటే, ఇది మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉన్న 7-సీటర్ కారుగా చెప్పొచ్చు.
25
రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్‌తోనే
ఈ కారు కొనేందుకు పూర్తి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన రూ. 8.5 లక్షలను లోన్ రూపంలో తీసుకోవచ్చు.
* ఒకవేళ రుణాన్ని 9 శాతం వడ్డీకి 5 ఏళ్ల టెన్యూర్‌కి తీసుకుంటే నెలకు సుమారు రూ. 17,655 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది.
* ఒకవేళ రుణాన్ని 9 శాతం వడ్డీకి 7 ఏళ్ల వ్యవధికి తీసుకుంటే నెలకు సుమారు రూ. 13,683 చెల్లించాల్సి ఉంటుంది.
35
ఇంజన్, పనితీరు వివరాలు
మారుతి ఎర్టిగా 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.
పవర్: 101.65 bhp
టార్క్: 136.8 Nm
ఇది పెట్రోల్, CNG రెండు వేరియంట్లలో లభిస్తుంది.
CNG వేరియంట్ పవర్: 88 PS
టార్క్: 121.5 Nmగా ఉంది.
ట్రాన్స్మిషన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. CNG వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. నగరంలోనూ, హైవేలోనూ సాఫీగా డ్రైవ్ చేయడానికి ఇది సరైన కాంబినేషన్‌గా చెప్పొచ్చు.
ఎర్టిగా ఇంటీరియర్‌లో విశాలమైన స్థలాన్ని, సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తుంది. వెనుక వరుసలో కూడా ప్రయాణికులకు సరిపడా లెగ్‌రూమ్ ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్స్‌కి లేదా లాంగ్ డ్రైవ్స్‌కి ఇది అద్భుతమైన ఎంపిక. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది.
55
ఏ కార్లకు పోటీనిస్తుంది.?
మారుతి ఎర్టిగా ప్రస్తుతం టయోటా రుమియన్ (Toyota Rumion), రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) వంటి 7-సీటర్ వాహనాలతో పోటీ పడుతుంది. అయితే, ఎర్టిగా నమ్మకమైన బ్రాండ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఎక్కువ మైలేజ్ వంటివి ఈ కారును ముందు వరుసలో ఉంచుతాయని చెప్పొచ్చు.