రూ. 50 వేల డౌన్‌పేమెంట్‌తో మీ కారును ఇంటికి తీసుకెళ్లండి.. నెల‌కు కేవ‌లం 6 వేలు చెల్లిస్తే చాలు

Published : Oct 22, 2025, 02:10 PM IST

Budget Car: మిడిల్ క్లాస్ కుటుంబాల‌ను అట్రాక్ట్ చేసేందుకు చాలా కంపెనీలు కార్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలాంటి వాటిలో ఆల్టో కే10 ఒక‌టి. తాజాగా జీఎస్టీ మార్పు త‌ర్వాత ఈ కారుపై మ‌రింత డిస్కౌంట్ ల‌భిస్తోంది. 

PREV
15
ఆల్టో K10 పై డిస్కౌంట్

అక్టోబ‌ర్ నెల‌లో మారుతి ఆల్టో K10 చిన్న హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 1,07,600 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కొత్త GST స్లాబ్ ప్రకారం రూ. 80,600 పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. దీని ఫలితంగా, ఆల్టో K10 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4,23,000 నుంచి రూ. 3,69,900కి తగ్గింది కాబట్టి వినియోగ‌దారుల‌కు భారీ ఊర‌ట ల‌భిస్తోంది.

25
కారులో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయంటే.?

మారుతి ఆల్టో K10 ఇప్పుడు చాలా ఆధునిక ఫీచర్లతో వస్తోంది. ప్రధానంగా:

* ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా

* 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మద్దతుతో)

* USB, బ్లూటూత్, AUX వంటి కనెక్టివిటీ ఆప్షన్లు

* మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ డ్రైవ్ సౌకర్యం

* ఈ ఫీచర్లు S-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి కార్లలో ఉండేవి, కానీ ఇప్పుడు ఆల్టో K10లో కూడా అందుబాటులో ఉన్నాయి.

35
భ‌ద్ర‌త‌ప‌ర‌మైన ఫీచ‌ర్లు

ఆల్టో K10లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండటం, స్టీరింగ్ వీల్ మల్టీఫంక్షనల్ నియంత్రణ, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి స్మార్ట్‌, సెక్యూర్ గా చేశాయి.

45
మైలేజ్ వివరాలు

ఇంజ‌న్ విష‌యానికొస్తే.. 1.0-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్ అందించారు. 66.62 PS ప‌వ‌ర్‌, 89 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ విష‌యానికొస్తే.. ఆటోమేటిక్ వేరియంట్: 24.90 km/l, మాన్యువల్ వేరియంట్: 24.39 km/l, CNG వేరియంట్: 33.85 km/kg ఇస్తోంద‌ని కంపెనీ చెబుతోంది.

55
ధ‌ర ఎంత అంటే.?

మారుతి ఆల్టో కే10 ప్రారంభ వేరియంట్ ధ‌ర రూ. 3.7 ల‌క్ష‌ల‌తో ప్రారంభ‌మ‌వుతుంది. ఆన్‌రోడ్ ప్రైజ్ విష‌యానికొస్తే రూ. 4.3 ల‌క్ష‌లకు ల‌భిస్తోంది. ఈ కారును రూ. 50 వేల డౌన్‌పేమెంట్‌తో సొంతం చేసుకోవ‌చ్చు. మిగిలిన మొత్తం 9.8 శాతం వ‌డ్డీకి రుణం పొందొచ్చు. 7 ఏళ్ల వ్య‌వ‌ధికి లోన్ తీసుకుంటే నెల‌కు రూ. 6409 చొప్పున ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories