Mahindra Scorpio Pickup Truck: అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ గ్రాండ్ ఎంట్రీ

Published : Aug 16, 2026, 09:06 AM IST

Mahindra Scorpio Lifestyler Pickup: మహీంద్రా తన కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్‌ను భారత్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. 2027 ఏప్రిల్ నాటికి ఇది మార్కెట్లోకి రానుంది. అదరగొట్టే లుక్స్, కేక అనిపించే ఫీచర్లతో వస్తోంది. ఆ వివరాలు మీకోసం.

PREV
16
కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మహీంద్రా నుంచి అదిరిపోయే స్కార్పియో లైఫ్‌స్టైలర్!

మహీంద్రా కంపెనీ లైఫ్‌స్టైలర్ పిక్అప్ సెగ్మెంట్‌లోకి సాలిడ్ రీఎంట్రీ ఇచ్చింది. స్కార్పియో ఎన్ మోడల్ ఆధారంగా రూపొందించిన ప్రొడక్షన్ వెర్షన్ పిక్అప్‌ను ‘స్కార్పియో లైఫ్‌స్టైలర్’ (గ్లోబల్ మార్కెట్లలో 'లైఫ్‌స్టైలర్') పేరుతో భారత్‌లో అధికారికంగా ప్రదర్శించింది. ఇది కేవలం స్కార్పియో ఎన్ వెనుక కార్గో బెడ్ తగిలించిన బండి మాత్రమే కాదు, అడ్వెంచర్ ఇష్టపడే నేటితరం వారికి, మోడ్రన్ బయ్యర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాస్ వెహికల్.

26
బోల్డ్ అండ్ రగ్గడ్ ఎక్స్‌టీరియర్ డిజైన్

స్కార్పియో లైఫ్‌స్టైలర్ డిజైన్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.

  • ముందు భాగంలో భారీ క్రోమ్ స్టడెడ్ రెక్టాంగ్యులర్ గ్రిల్, దానికి ఇరువైపులా స్క్వేర్డ్-ఆఫ్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్ ఉంటాయి. గ్రిల్ పైన 'SCORPIO' అక్షరాలు మెరుస్తుంటాయి.
  • అగ్రెసివ్ బంపర్, చంకీ స్కిడ్ ప్లేట్, ఆరంజ్ టోవింగ్ పాయింట్స్, బ్లాక్ సర్రౌండ్స్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్‌లాంప్స్ ఉన్నాయి.
  • ప్రొఫైల్‌లో బాక్సీ సిల్హౌట్, డ్యూయల్ క్యాబ్ లేఅవుట్, స్ట్రెయిట్ విండ్‌షీల్డ్, రూఫ్ రైల్స్, గ్లోసీ బ్లాక్ ఓఆర్వీఎంలు, డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ ఇన్సర్ట్‌లు ఉంటాయి.
  • ఆఫ్‌రోడింగ్ కోసం ఫెండర్-మౌంటెడ్ స్నోర్కెల్, 18-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ అంటే 255/65 గుడ్‌ఇయర్ రాంగ్లర్ టైర్లు అందించారు.
  • వెనుక వైపు 'MAHINDRA' ఎంబోస్డ్ టెయిల్‌గేట్, ఎల్ఈడీ టెయిల్‌లాంప్స్, స్టీల్ రిమ్ స్పేర్ వీల్, లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉన్నాయి.
  • ఈ పిక్అప్ వ్యాలీ ఎడిషన్, రీఫ్ ఎడిషన్, ట్రయిల్ ఎడిషన్ అనే 3 స్పెషల్ థీమ్‌లలో లభిస్తుంది.
  • కలర్ ఆప్షన్లు: ఆక్వారీఫ్ (బ్లూ), సహారా బెజ్, ఆర్టెమిస్ గ్రే.
36
ప్రీమియం ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు

ఇంటీరియర్ వివరాలను పూర్తిగా వెల్లడించకపోయినా, టీజర్ల ప్రకారం ఇది గ్లోబల్ పిక్అప్ స్థాయి ఫీచర్లతో రానుంది. రిపోర్టుల ప్రకారం..

  • క్యాబిన్‌లో పెద్ద పోర్ట్రెయిట్-ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అల్యూమినియం ఇన్సర్ట్‌తో కూడిన కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
  • సెంటర్ కన్సోల్‌లో సిల్వర్ ఇన్సర్ట్‌లు, 4x4 సిస్టమ్ కోసం రోటరీ డయల్, పెద్ద సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఉంటాయి.
  • ఫీచర్ల జాబితాలో సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉండే అవకాశం ఉంది.
46
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక్అప్ సేఫ్టీ, ఇంజిన్ ఆప్షన్లు
  • భద్రత పరంగా ఈ వాహనంలో లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది.
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎఎస్సీ, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంటాయి.
  • 540-డిగ్రీ కెమెరా సిస్టమ్ ద్వారా వాహనం చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడవచ్చు.
  • ఇంజిన్ ఆప్షన్లు:
  • 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్: 203 PS పవర్, 380 Nm టార్క్ (6-స్పీడ్ MT / 6-స్పీడ్ AT, RWD).
  • 2.2-లీటర్ mHawk డీజిల్: 175 PS పవర్, 400 Nm టార్క్ (6-స్పీడ్ MT / 6-స్పీడ్ AT, RWD / 4WD).
56
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ లాంచ్ వివరాలు, మార్కెట్ లో గట్టి పోటీ

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ను ముంబైలోని మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియో లో డిజైన్ చేసి, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ లో డెవలప్ చేశారు. మహీంద్రా లైఫ్‌స్టైలర్ పిక్అప్‌ ధరలను 2027 ఏప్రిల్‌లో ప్రకటిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 19.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) లోపు ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో ఇసుజు వీ-క్రాస్, టయోటా హిలక్స్‌లకు గట్టి పోటీనిస్తుంది.

66
గ్లోబల్ ప్లాన్స్, బిజినెస్ స్ట్రాటజీ

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా వంటి గ్లోబల్ మార్కెట్లను మహీంద్రా టార్గెట్ చేస్తోంది. "అథెంటిక్ కెపాసిటీతో పాటు రోజువారీ వాడకానికి అనువైన టెక్నాలజీ, సేఫ్టీ కోరుకునే కస్టమర్ల కోసం ఈ మోడల్ తీసుకొస్తున్నాం" అని మహీంద్రా వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో మహీంద్రా తమ బీఈ 6-SPORTEQ ఎలక్ట్రిక్ SUV సిరీస్‌ను కూడా పరిచయం చేసింది. దీని డెలివరీలు 2026 ఆగస్టు 26 నుండి ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఎడిషన్, ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ మోడళ్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది.

Read more Photos on
click me!

Recommended Stories