Car Tips: వాతావరణ మార్పులు మన ఆరోగ్యంతో పాటు కారుపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే కారు సరిగ్గా పని చేయాలంటే సమయానికి మెయింటెనెన్స్ చాలా అవసరం. చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే, తర్వాత పెద్ద సమస్యలు వస్తాయి.
ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత ఇంజిన్ ఆయిల్‌ను తప్పకుండా చెక్ చేయాలి. శుభ్రమైన ఆయిల్ ఇంజిన్ స్మూత్‌గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఆయిల్ తగ్గిపోతే లేదా మురికిగా మారితే ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. అలాగే బ్రేక్ ఆయిల్, కూలెంట్ కూడా సరిగ్గా ఉన్నాయా చూసుకోవాలి. ఇవి కారు సేఫ్టీకి చాలా ముఖ్యమైనవి.
24
టైర్లు, బ్యాటరీ పరిస్థితి ముఖ్యం
టైర్లలో సరైన గాలి ఉండటం చాలా అవసరం. టైర్లు బాగా ఉంటే మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది, డ్రైవింగ్ సేఫ్‌గా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాడైన టైర్లు ప్రమాదానికి దారి తీస్తాయి. అలాగే బ్యాటరీని కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయాలి. బ్యాటరీ బలహీనంగా ఉంటే కారు స్టార్ట్ అవ్వడంలో ఇబ్బంది వస్తుంది.
34
ఫిల్టర్లు, లైట్లు, వైపర్లు చెక్ చేయాలి
ఎయిర్ ఫిల్టర్, కేబిన్ ఫిల్టర్ మురికిగా ఉంటే ఇంజిన్ పనితీరు తగ్గుతుంది, కారులో గాలి కూడా సరిగా ఉండదు. అలాగే హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా చూసుకోవాలి. వర్షాకాలంలో వైపర్లు సరిగా లేకపోతే డ్రైవింగ్ చాలా కష్టంగా మారుతుంది.
పాడైన రోడ్లపై ఎక్కువగా డ్రైవ్ చేస్తే సస్పెన్షన్ దెబ్బతింటుంది. దీంతో డ్రైవింగ్ సమయంలో షాక్‌లు ఎక్కువగా అనిపిస్తాయి. స్టీరింగ్‌లో ఏదైనా శబ్దం లేదా వైబ్రేషన్ వస్తే వెంటనే చెక్ చేయాలి. అలాగే కారు బయట, లోపల శుభ్రంగా ఉంచడం, సమయానికి సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే చిన్న సమస్యలు ముందే గుర్తించి పెద్ద ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు.