Budget CNG Cars: రూ. 7 ల‌క్ష‌ల నుంచే మొదలు.. బెస్ట్ బ‌డ్జెట్ CNG కార్లు ఇవే. ఫీచ‌ర్లు కూడా అదుర్స్

Published : Feb 15, 2026, 10:28 AM IST

Budget CNG Cars: బ్యాంకులు సుల‌భ‌మైన రుణాలు అందిస్తుండ‌డం, కార్ల ధ‌ర‌లు కూడా త‌గ్గ‌డంతో మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కూడా కారు కల‌ను సొంతం చేసుకుంటున్నారు. రూ. 10 ల‌క్ష‌ల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సీఎన్జీ కార్ల వివ‌రాలు, వాటి ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి 

PREV
15
10 లక్షల లోపు బెస్ట్ CNG కార్లు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో చాలామంది CNG కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ ఇంధన ఖర్చు, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కారణంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇవి మంచి ఎంపికగా మారాయి. ఇప్పుడు 10 లక్షల లోపు బడ్జెట్‌లో లభించే ప్రముఖ CNG కార్ల వివరాలు తెలుసుకుందాం.

25
మారుతి సుజుకీ స్విఫ్ట్ సీఎన్‌జీ

ఇండియన్ మార్కెట్లో ఇది చాలా పాపులర్ హ్యాచ్‌బ్యాక్. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 8.20 లక్షల నుంచి రూ. 9.20 లక్షల వరకు ఉంటుంది.

మైలేజ్: 32.85 Km/kg

సేఫ్టీ: అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్

ఫీచర్లు: 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

స్టైలిష్ డిజైన్, విశ్వసనీయ పనితీరు కారణంగా ఇది ఫ్యామిలీలకు మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.

35
టాటా మోట‌ర్ పంచ్ సీఎన్‌జీ

SUV లుక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఈ కారు ధర రూ. 7.30 లక్షల నుంచి రూ. 10.17 లక్షల వరకు ఉంటుంది.

మైలేజ్: 26.99 Km/kg (ARAI ప్రకారం)

ఫీచర్లు: డ్యూయల్ సిలిండర్ CNG టెక్నాలజీ, 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

సేఫ్టీ: డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, బలమైన బాడీ

మైక్రో-SUV డిజైన్, సేఫ్టీ స్టాండర్డ్స్ వల్ల ఇది తక్కువ బడ్జెట్‌లో మంచి SUV.

45
మారుతి సుజుకీ వ్యాగ‌నార్ సీఎన్‌జీ

భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే CNG కార్లలో ఇది ఒకటి. ధర రూ. 6.69 లక్షల నుంచి రూ. 7.14 లక్షల వరకు ఉంటుంది.

మైలేజ్: 34.05 Km/kg

ఇంజిన్: 1.0 లీటర్ K-సిరీస్ ఇంజిన్

ప్రత్యేకత: తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్

రోజూ ప్రయాణించే వారికి ఇది చాలా సరైన ఎంపికగా చెప్పొచ్చు.

55
నిస్సాన్ మ్యాగ్నైట్ సీఎన్‌జీ

స్టైలిష్ లుక్‌తో ప్రీమియం ఫీచర్లు కలిగిన SUV. ధర రూ. 6.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

మైలేజ్: 27.6 Km/kg

ఫీచర్లు: 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ చార్జర్

సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్స్

వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌గా ఇది మంచి ఎంపిక. అయితే చిన్న పట్టణాల్లో సర్వీస్ నెట్‌వర్క్ కొద్దిగా పరిమితంగా ఉండొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories