డిజైన్ పరంగా చూస్తే, కొత్త డస్టర్ మునుపటి కంటే బోల్డ్, మస్క్యులర్‌గా కనిపిస్తుంది. ఇందులో 212 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో పాటు, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనికి కొత్త అందాన్ని తెచ్చాయి. మౌంటెన్ జేడ్ గ్రీన్ కలర్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.
సాంకేతికత విషయానికి వస్తే, ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా Google built in ఫీచర్‌తో 25.65 సెం.మీ OpenR లింక్ మల్టీమీడియా సిస్టమ్‌ను అందించారు. గూగుల్ మ్యాప్స్, వాయిస్ అసిస్టెంట్, ప్లే స్టోర్ సేవలు నేరుగా ఇందులో లభిస్తాయి. భవిష్యత్తులో గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని అప్డేట్ కూడా రానుంది.
రెనాల్ట్ డస్టర్ 2026 వారంటీ, బుకింగ్ వివరాలు
కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి రెనాల్ట్ ఫరెవర్ ప్రోగ్రామ్ కింద 7 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం R Pass ద్వారా రూ. 21,000 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ధరలను మార్చి 2026 మధ్యలో ప్రకటిస్తారు. ఏప్రిల్ 2026 నుండి డెలివరీ మొదలవుతుంది. అయితే, హైబ్రిడ్ మోడల్ కోసం దీపావళి 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.