సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న నిస్సాన్ టెక్టాన్ SUV

Published : Oct 11, 2025, 11:39 PM IST

Nissan Tekton SUV : నిస్సాన్ టెక్టాన్ SUV త్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది. బాక్సీ డిజైన్, 18 ఇంచుల అలాయ్ వీల్స్, హైబ్రిడ్ ఇంజిన్, ఏడబ్ల్యూడీ వంటి అద్భుతమైన అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

PREV
16
భారత మార్కెట్లోకి నిస్సాన్ టెక్టాన్ SUV

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ త్వరలో భారత మార్కెట్లో తన కొత్త SUV నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)ను విడుదల చేయనుంది. ఈ కొత్త మోడల్ బాక్సీ డిజైన్, మస్క్యులర్ రోడ్ ప్రెజెన్స్, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. కంపెనీ ఇప్పటికే నిస్సాన్ టెక్టాన్ SUV లాంచ్ ప్లాన్‌ను వెల్లడించింది. ఈ వాహనం హుందయ్ క్రిటా, కియా సెల్టోస్, గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టోర్, స్కోడా కుషక్, సిట్రోయెన్ ఎయిర్ క్రాస్ వంటి ప్రముఖ SUV లకు పోటీ ఇవ్వనుంది.

26
నిస్సాన్ టెక్టాన్ SUV: శక్తివంతమైన బాక్సీ డిజైన్

నిస్సాన్ టెక్టాన్ SUV ఒక బాక్సీ, రగ్డ్ లుక్ తో వస్తోంది. ఇందులో క్లామ్‌షెల్ బోనెట్, రియర్ వీల్ ఆర్చ్‌లు, మస్క్యులర్ బాడీ క్లాడింగ్ లాంటి ఎలిమెంట్లు కనిపిస్తాయి. కారు ముందు భాగంలో కనెక్టెడ్ LED DRLలు, వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లైట్లు, అలాగే క్రోమ్ గ్రిల్ హైలైట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ డిజైన్ కారణంగా టెక్టాన్ రోడ్డుపై శక్తివంతమైన ప్రెజెన్స్ ఇస్తుంది.

36
నిస్సాన్ టెక్టాన్ SUV : 18 ఇంచుల అలాయ్ వీల్స్, 225 సెక్షన్ టైర్లు

స్పై షాట్స్ ప్రకారం.. నిస్సాన్ టెక్టాన్ SUV లో 18 ఇంచుల అలాయ్ వీల్స్ తో పాటు 225 సెక్షన్ టైర్లు ఉన్నాయి. ఇవి ఈ సెగ్మెంట్‌లో అత్యంత వెడల్పైన టైర్లు. లోయర్ వేరియంట్లలో కూడా 17 ఇంచుల స్టీల్ వీల్స్ తో ఇదే టైర్ సైజ్ అందించనున్నారు. ఇతర C-SUV లలో సాధారణంగా 215 సెక్షన్ టైర్లు మాత్రమే ఉండగా, నిస్సాన్ టెక్టాన్ ఈ విషయంలో ప్రత్యేకంగా ఉంది.

46
నిస్సాన్ టెక్టాన్ SUV : ప్రీమియం ఇంటీరియర్, డిజిటల్ ఫీచర్లు

నిస్సాన్ టెక్టాన్ SUV లోపలి భాగం పూర్తిగా ప్రీమియంగా ఉంటుంది. లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, రోజ్ గోల్డ్ ఇన్‌లే, సాఫ్ట్-టచ్ మెటీరియల్, ఎంబియంట్ లైటింగ్ వంటి అంశాలు లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి. అలాగే, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి ఫీచర్లతో నిస్సాన్ టెక్టాన్ SUV టెక్నాలజీ పరంగా అత్యాధునికంగా మారింది.

56
నిస్సాన్ టెక్టాన్ SUV లో హైబ్రిడ్ ఇంజిన్, ఏడబ్ల్యూడీ ఆప్షన్

నిస్సాన్ టెక్టాన్ SUVని రెనాల్ట్ నిస్సాన్ CMF-B ప్లాట్‌ఫారమ్పై నిర్మించారు. ఇందులో పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా ఉంది. ఇది ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం హైబ్రిడ్, AWD కాంబినేషన్‌ను మారుతి సుజూకి, టోయోటా మాత్రమే అందిస్తున్నాయి. నిస్సాన్ టెక్టాన్ SUV లో కూడా ఈ ఫీచర్ ను తీసుకొచ్చారు.

66
నిస్సాన్ టెక్టాన్ SUV: 7-సీటర్ వెర్షన్.. లాంచ్ టైమ్‌లైన్

నిస్సాన్ సంస్థ 5-సీటర్ వెర్షన్ తర్వాత 7-సీటర్ నిస్సాన్ టెక్టాన్ SUV వెర్షన్ ను కూడా రిలీజ్ చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ బోరియల్ ప్లాట్‌ఫామ్ పై ఆధారపడనుంది. 6-సీటర్ క్యాప్టెన్ చైర్ వేరియంట్ కూడా మార్కెట్ లోకి తెచ్చే యోచనలో ఉందని సమాచారం.

నిస్సాన్ టెక్టాన్ SUV భారత ఆటో మార్కెట్లో కొత్త సంచలనంగా మారే అవకాశం ఉంది. ఆధునిక డిజైన్, వెడల్పైన టైర్లు, ప్రీమియం ఇంటీరియర్, హైబ్రిడ్ ఇంజిన్, AWD ఫీచర్లు.. ఇవన్నీ కలిసి టెక్టాన్‌ను నిస్సాన్ లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా నిలబెట్టే ఛాన్స్ ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories