Best Car Color : బ్లాక్, వైట్ లేదా రెడ్.. ఏ రంగు కారుతో మీకు లాభమో తెలుసా?

Published : Dec 26, 2025, 03:03 PM IST

Black Vs White Vs Red Car : కారు రంగు ఎంపిక కేవలం అందం కోసమే కాదు, ఇది మెయింటెనెన్స్, రీసేల్ వాల్యూపై కూడా ప్రభావం చూపుతుంది. నలుపు, తెలుపు, ఎరుపు రంగు కార్ల లాభనష్టాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
నలుపు vs తెలుపు vs ఎరుపు: కారు రంగు ఎంపికలో ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

కొత్త కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం. అయితే, కారు మోడల్, ఇంజిన్ సామర్థ్యం, ఫీచర్లను ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తారో.. కారు రంగును ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మందికి కారు రంగును ఎంచుకోవడం చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు.

కానీ, ఇది కేవలం కారు బయటి అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మీరు ఎంచుకునే రంగు.. ఆ కారును మీరు ఎంత తరచుగా శుభ్రం చేయాలి? కారు లోపల ఎంత వేడిగా ఉంటుంది? భవిష్యత్తులో ఆ కారును అమ్మేటప్పుడు ఎంత ధర వస్తుంది? అనే అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఇండియాలో కార్లు కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకుంటారు. ఈ మూడు రంగులు వేర్వేరు సంకేతాలను ఇస్తాయి. ప్రతి రంగుకు దాని సొంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. కొన్ని రంగులు చూడటానికి చాలా క్లాసీగా ఉంటాయి, కొన్ని అందరి దృష్టిని ఆకర్షిస్తాయి, మరికొన్ని ప్రాక్టికల్ గా బాగుంటాయి. అందుకే మీరు కారు కొనేముందు, రోజువారీ వినియోగంలో ఏ రంగు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

26
నలుపు రంగు: రాయల్ లుక్, నిర్వహణ సవాళ్లు ఏమిటి?

నలుపు రంగు కార్లు ఎప్పుడూ ప్రీమియం, శక్తివంతమైన లుక్‌ను ఇస్తాయి. ముఖ్యంగా లగ్జరీ సెడాన్‌లు, పెద్ద ఎస్‌యూవీలకు నలుపు రంగు చాలా బాగా సెట్ అవుతుంది. ఒక బ్లాక్ కలర్ కారు శుభ్రంగా ఉన్నప్పుడు, అది రోడ్డుపై వెళ్తుంటే ఆ స్టైల్  వేరుగా ఉంటుంది. ఇది చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, ఇందులో ఒక చిక్కు ఉంది. నలుపు రంగుపై దుమ్ము, గీతలు, స్విర్ల్ మార్క్స్ చాలా త్వరగా కనిపిస్తాయి. చిన్నపాటి దుమ్ము పడినా సరే, కారు డల్‌గా కనిపించే అవకాశం ఉంది.

అంతేకాకుండా, వేసవి కాలంలో నలుపు రంగు కార్లు ఇతర రంగుల కంటే త్వరగా వేడెక్కుతాయి. నలుపు రంగు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించడం వల్ల క్యాబిన్ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల మీరు ఏసీని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కారును తరచుగా శుభ్రం చేయడానికి, డిటైలింగ్ చేయడానికి ఇష్టపడేవారైతే, దుమ్మును ఎప్పటికప్పుడు తుడుచుకోగలగితే.. నలుపు రంగు మీకు మంచి ఎంపిక అవుతుంది.

36
తెలుపు రంగు : ప్రశాంతత, రీసేల్ వాల్యూ

భారతదేశంలో అత్యంత ప్రాక్టికల్ ఛాయిస్ ఏదైనా ఉందంటే అది తెలుపు రంగు మాత్రమే. తెలుపు రంగు కార్లు సూర్యరశ్మిని, వేడిని సమర్థంగా వెనక్కి తిప్పికొడతాయి. దీనివల్ల కారు క్యాబిన్ లోపల, ముఖ్యంగా మన భారతీయ వాతావరణంలో, కొంచెం చల్లగా ఉంటుంది. నిర్వహణ విషయంలో కూడా తెలుపు రంగు చాలా బెస్ట్. ఈ రంగు కార్లపై చిన్న చిన్న గీతలు, దుమ్ము పెద్దగా కనిపించవు. అందుకే వీటిని మెయింటైన్ చేయడం చాలా సులభం.

తెలుపు రంగు కార్లకు మార్కెట్లో మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. అందుకే టాక్సీలు, ఫ్యామిలీ కార్లుగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, కొంతమందికి తెలుపు రంగు చాలా సాదాసీదాగా లేదా బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ, ప్రయోజనాల పరంగా చూస్తే వైట్ కలర్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది.

46
ఎరుపు రంగు : స్పోర్టీ లుక్, అటెన్షన్

ఎరుపు రంగు కార్లు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షించాలనుకునే వారికి సరైన ఎంపిక. ఎరుపు రంగు స్పోర్టీగా, తాజా, కొత్తదిలా కనిపిస్తుంది. హాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, పెర్ఫార్మెన్స్ కార్లకు ఈ రంగు చాలా బాగా సూట్ అవుతుంది. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కూడా ఎరుపు రంగు కారు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫోటోల్లో కూడా ఇది చాలా బాగా వస్తుంది.

అయితే, ఎరుపు రంగు కార్లకు ఉన్న ప్రధాన ప్రతికూలత రీసేల్ వాల్యూ. ఎరుపు అనేది వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన రంగు కాబట్టి, దీన్ని కొనడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య తక్కువగా ఉండవచ్చు. అలాగే, ఎరుపు రంగులోని కొన్ని షేడ్స్ తరచుగా ఎండలో పార్క్ చేయడం వల్ల త్వరగా వెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎరుపు రంగును ఎంచుకునేవారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

56
ఏ రంగును ఎంచుకోవాలి?

రంగు ఎంపిక అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. అయితే, నిపుణుల సూచనల ప్రకారం..

  • మీరు బోల్డ్, ప్రీమియం లుక్ కోరుకుంటే, కారు నిర్వహణకు సమయం కేటాయించగలిగితే.. నిస్సందేహంగా బ్లాక్ కలర్ ను ఎంచుకోండి.
  • మీకు మంచి రీసేల్ వాల్యూ కావాలంటే, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలంటే.. తెలుపు రంగు ఉత్తమ ఎంపిక.
  • మీ కారు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలని, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటే.. ఎరుపు రంగు వైపు వెళ్లండి.
66
కొత్త కారు : ఉత్తమమైన రంగు ఏది?

టెక్నికల్ అంశాలు, లాభనష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ.. అంతిమంగా బెస్ట్ కలర్ అనేది మీరు దేనినైతే ప్రతిరోజూ చూసి ఆనందించగలరో అదే. మీరు ఉదయం లేచి మీ కారును చూసినప్పుడు మీకు సంతోషం కలిగించే రంగు ఏదైతే ఉందో, అదే మీకు సరైన ఎంపిక. కాబట్టి మీ అవసరాలు, మీ ఇష్టాయిష్టాలను చూసుకుని సరైన నిర్ణయం తీసుకోండి. రంగుతో మీకు పెద్దగా ప్రాధాన్యం లేకపోతే వైట్ కలర్ టెక్నికల్ గా బెస్ట్ ఎంపిక.

Read more Photos on
click me!

Recommended Stories