Renault: రూ. 7 ల‌క్ష‌ల‌కే 7 సీట్ల కారు.. సేఫ్టీతో పాటు అదిరిపోయే ఫీచ‌ర్లు

Published : Dec 25, 2025, 11:30 AM IST

Renault: భార‌త మార్కెట్లో 7 సీట‌ర్ కార్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. సాధార‌ణంగా 7 సీట‌ర్ కార్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే మహీంద్రా, టాటా, హ్యుందాయ్, టయోటా బ్రాండ్లకు పోటీగా రేనాల్ట్ తీసుకొచ్చిన ఓ కారు అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్త‌తోంది. 

PREV
15
రూ.6.88 లక్షల నుంచి మొద‌లు

రెనాల్ట్ ట్రైబ‌ర్ ప్రారంభ ధర రూ.6.88 లక్షలు (ఆన్ రోడ్). టాప్ వేరియంట్ ధర రూ.10.18 లక్షలు. మొత్తం 11 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, CNG ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఎంపికలు కూడా లభిస్తాయి.

25
వేరియంట్‌ల ధరలు

ట్రైబ‌ర్ అథెంటిక్‌ – రూ.6.88 లక్షలు

ట్రైబ‌ర్ అథెంటిక్‌ CNG – రూ.7.67 లక్షలు

ట్రైబ‌ర్ ఎవాల్యుష‌న్ – రూ.7.89 లక్షలు

ట్రైబ‌ర్ ఎవాల్యుష‌న్ CNG – రూ.8.68 లక్షలు

ట్రైబ‌ర్ టెక్నో – రూ.8.69 లక్షలు

ట్రైబ‌ర్ ఎమోష‌న్ – రూ.9.38 లక్షలు

ట్రైబ‌ర్ టెక్నో CNG – రూ.9.48 లక్షలు

ట్రైబ‌ర్ ఎమోష‌న్ డ్యూయ‌ల్ టోన్ – రూ.9.62 లక్షలు

ట్రైబ‌ర్ ఎమోష‌న్ AMT – రూ.9.93 లక్షలు

ట్రైబ‌ర్ ఎమోష‌న్ CNG – రూ.10.17 లక్షలు

ట్రైబ‌ర్ ఎమోష‌న్ AMT Dual Tone – రూ.10.18 లక్షలు

35
ఇంజిన్ సామర్థ్యం – 999cc పెట్రోల్ యూనిట్

ఈ కారులో 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 71 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 96 Nm టార్క్ ఇస్తుంది. 5 గేర్‌లతో వస్తుంది. నగర డ్రైవింగ్‌కు, హైవే ప్రయాణాలకు సరిపోయే ట్యూనింగ్ ఉంది.

45
ఎంత మైలేజ్ ఇస్తుందంటే.?

నగర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్‌కు సగటున 13.64 కిలోమీటర్లు ఇస్తుంది. హైవేలో లీటర్‌కు 17.86 కిలోమీటర్లు వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. క్యాబిన్ డిజైన్ సౌకర్యంగా ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్ తేలికగా ఉండటంతో కొత్త డ్రైవర్లు కూడా సులభంగా నడిపగ‌ల‌రు.

55
భద్రతా ఫీచర్లు – 4 స్టార్ రేటింగ్

రెనాల్ట్ ట్రైబ‌ర్‌లో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ABS, EBD సిస్టమ్స్ ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ESP, ట్రాక్షన్ కంట్రోల్ సదుపాయం ఇచ్చారు. NCAP సంస్థ ఈ కారుకు 4 స్టార్ భద్రతా రేటింగ్ ఇచ్చింది. తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో ఈ కారు లభిస్తుంది. మారుతి ఎర్టిగా, రేనాల్ట్ కిగర్, నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories