ఐటీ సహా ఇతర రంగాల్లో జీతాల పెరుగుదల కనిపిస్తున్నా, ఉద్యోగుల్లో ఆర్థిక ఒత్తిడి మాత్రం తగ్గటం లేదని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 69 శాతం మంది తమ ఆదాయం జీవన వ్యయాలకు సరిపడటం లేదని పేర్కొన్నారు.
ముఖ్యంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, పుణె వంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో మాత్రం వేతన పెంపు వేగంగా జరుగుతోందని కూడా ఈ నివేదిక తెలియజేసింది. ఈ సర్వేను ఇండీడ్ సంస్థ దేశవ్యాప్తంగా 1,311 మంది కంపెనీ యజమానులు, 2,531 మంది ఉద్యోగులను ప్రశ్నించి రూపొందించింది.