సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఐదెంకల జీతం, ఐదు రోజుల పని, బిందాస్ లైఫ్.. చాలా మందిలో ఉండే భావనే. అయితే ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఐటీ అంటేనే హడల్ పుట్టే పరిస్థితి నెలకొంటోంది. ఉద్యోగాల ఊచకోత భయపెడుతోంది.
ప్రపంచ ఐటీ రంగంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగాల ఊతకోచ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ప్రభావం భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల టీసీఎస్ చేపట్టిన తొలగింపులు ఈ పరిస్థితిని పీక్స్‌కి తీసుకెళ్లాయి. ఇదిలా ఉంటే ఉద్యోగాల ఊస్టింగ్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రాబోయే 2-3 ఏళ్లలో భారత్‌లో సుమారు 5 లక్షల ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
DID YOU KNOW ?
అనుభవం ఉన్న వారే
స్టాఫింగ్ డేటా ప్రకారం 13-25 సంవత్సరాల అనుభవం కలిగిన 4.3 లక్షల మందికి ఉద్యోగ భద్రత తగ్గే ప్రమాదం ఉంది.
25
ప్రధాన కారణాలు ఏంటి.?
ప్రాథమిక కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్, మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి పనులను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సులభంగా నిర్వహిస్తోంది. గతంలో వీటికి పెద్ద టీంలు అవసరమైనా, ఆటోమేషన్‌తో కంపెనీలు తక్కువ సిబ్బందితోనే పనులు పూర్తి చేస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యం లేని మేనేజర్లు, టెస్టర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ సిబ్బంది మొదటగా ప్రభావితం అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
35
అధిక అనుభవం ఉన్నవారికే ఎక్కువ ముప్పు
స్టాఫింగ్ డేటా ప్రకారం 13-25 సంవత్సరాల అనుభవం కలిగిన 4.3 లక్షల మందికి ఉద్యోగ భద్రత తగ్గే ప్రమాదం ఉంది. తొలగింపుల్లో 70 శాతం వరకు 4-12 సంవత్సరాల అనుభవం ఉన్నవారిపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. టీసీఎస్ ఇప్పటికే 12,200 మంది మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను తొలగించడం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.
భారత జీడీపీలో ఐటీ రంగం 7 శాతం పైగా వాటా కలిగి ఉంది. ఇది లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా గృహాలు, కార్లు, పర్యాటకం, విలాస వస్తువులపై డిమాండ్‌ను పెంచుతుంది. ఉద్యోగాలు భారీగా తగ్గితే వినియోగదారుల ఖర్చు తగ్గి, పెట్టుబడులు వాయిదా పడే ప్రమాదం ఉంది. పట్టణ మధ్యతరగతి మార్కెట్లలో ఇది ఆర్థిక వృద్ధిని బలహీనపరచవచ్చు.
55
నైపుణ్యాలు పెంచుకోవడమే ఏకైక మార్గం
గతంలో సాంకేతిక మార్పులు ప్రధానంగా సంస్థలను ప్రభావితం చేసేవి. కానీ ఏఐ యుగంలో వ్యక్తిగత నైపుణ్యాలే కీలకం. నాస్కామ్ ప్రకారం, మారుతున్న మార్కెట్‌కు అనుగుణంగా కొత్త డిజిటల్, ఏఐ స్కిల్స్‌ను అందిపుచ్చుకోని వారు వెనుకబడతారు. టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నాని కూడా ఆటోమేషన్ వ్యాపారాల కేంద్రబిందువుగా మారుతుందని హెచ్చరించారు. అందువల్ల, ఐటీ నిపుణులు తక్షణం నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం తప్పనిసరని చెప్పడంలో సందేహం లేదు.