Bank Jobs : నెలకు రూ.90,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి

Published : Aug 07, 2025, 09:12 PM ISTUpdated : Aug 07, 2025, 09:20 PM IST

Bank of Baroda Jobs Notification : ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ లెవెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తివివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగాల భర్తీ

Bank of Baroda Jobs Notification : భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగం, నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు జీతం... ఇంత మంచి అవకాశం నిరుద్యోగ యువతీయువకులకు ఇంకేముంటుంది చెప్పండి. మరీముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నోటిఫికేషన్ జీవితంలో సెటిల్ అయ్యేందుకు అద్భుత అవకాశం ఇస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ బ్యాంక్ జాబ్స్ లో ఖచ్చితంగా ఒకటి మీసొంతం అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2025 సంవత్సరానికిగాను 414 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ముఖ్యంగా సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

DID YOU KNOW ?
బ్యాంక్ ఆఫ్ బరోడాను స్థాపించిందెవరు
భారతదేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్దది బ్యాంక్ ఆఫ్ బరోడా. దీన్ని బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ 1908లో స్థాపించారు.
27
ముఖ్యమైన తేదీలు
  1. నోటిఫికేషన్ విడుదల : ఆగస్ట్ 6, 2025
  2. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : ఆగస్ట్ 6, 2025
  3. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : ఆగస్ట్ 26, 2025
  4. దరఖాస్తు ఫీజ్ చెల్లింపుకు చివరితేదీ : ఆగస్ట్ 26, 2025

ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమయ్యింది. కాబట్టి నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు కలిగివుండి బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి కలిగినవారు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

37
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
  • మొదట బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in/ ఓపెన్ చేయండి
  • హోమ్ పేజ్ లో కెరీర్ సెక్షన్ పై క్లిక్ చేయండి... కెరీర్స్ విభాగంలో కరెంట్ ఆపర్చునిటీస్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ ''Recruitment of Human Resource on Regular Basis for Retail Liabilities and Rural & Agri Banking Departments Advt. No. BOB/HRM/REC/ADVT/2025/11'' కనిపిస్తుంది. కొద్దిగా కిందకు స్క్రోల్ చేస్తే ''Apply Now'' కనిపిస్తుంది... దీనిపై క్లిక్ చేయండి.
  • మీరు ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో ఎంచుకుని ఈమెయిల్ ఐడి, ఇతర వివరాలతో దరఖాస్తును పూర్తిచేయండి. అవసరమైన డాక్యుమెంట్స్, ఫోటో, డిజిటల్ సిగ్నిచర్ అప్ లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ లో చెల్లించండి.
  • అన్ని వివరాలను మరోసారి సరిచూసుకుని సబ్మిట్ చేయండి.
  • ఈ అప్లికేషన్ ను ప్రింటవుట్ తీసుకొండి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
47
అప్లికేషన్ ఫీజు
  • జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులు రూ.850 చెల్లించాలి.
  • ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూడి, ఈఎస్ఎం/డిఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లించాలి.
  • ఈ అప్లికేషన్ పీజు నాన్ రిఫండబుల్... అంటే ఒక్కసారి చెల్లించాక పరీక్ష రాయకున్నా డబ్బులు తిరిగి ఇవ్వబడవు.
57
అర్హతలు

సేల్స్ మేనేజర్ పోస్టుకు మార్కెటింగ్ లో గ్రాడ్యుయేషన్ అంటే MBA, అందుకు సరిపోయే కోర్సు చేసివుండాలి. అలాగే మూడు సంవత్సరాలు ఎక్కడైనా సేల్స్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోస్టుకు అగ్రికల్చర్/హార్టికల్చర్/ బయో టెక్నాలజీ/ ఫుడ్ టెక్నాలజీ వంటి బయాలజీ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసివుండాలి. అలాగే అగ్రి సేల్స్ విభాగంలో 1 సంవత్సరం ఉద్యోగం చేసిన అనుభవం ఉండాలి.

67
ఎంపిక విధానం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి సైకోమెట్రి టెస్ట్ ఉంటుంది. అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే బ్యాంక్ అధికారులకు ఎంపిక ప్రక్రియలో మార్పులు చేసే అధికారం ఉంటుంది... అలాగే వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.

77
సాలరీ

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగులకు మంచి జీతాలే ఉంటాయి. ఈ పోస్టులకు కూడా అనుభవం, ఇతర అంశాల ఆధారంగా నెలకు రూ.64,000 నుండి రూ.93 వేలవరకు సాలరీ ఉంటుంది. ఇతల అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories