జీతం తక్కువగా వస్తోందని మీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాల్సిన అవసరం లేదు… కాస్త తెలివిగా ఆలోచిస్తే సైడ్ ఇన్కమ్ ను జనరేట్ చేసుకోవచ్చు… మీతో పాటు కుటుంబానికి మంచి సౌకర్యాలు అందించవచ్చు.
ఈ రోజుల్లో నెల జీతంతోనే సంసారాన్ని నెట్టుకురావడం చాలా కష్టంగా మారింది. అలాగని మన సరదాలు, ట్రిప్పులు, ఇష్టాలను వదులుకోలేం కదా. అందుకే కొన్ని స్మార్ట్ ఇన్‌కమ్ హ్యాక్స్‌తో జీతం తక్కువైనా లైఫ్‌స్టైల్‌ను హై రేంజ్‌లో మెయింటెయిన్ చేయొచ్చు. టాప్ 5 సైడ్ ఇన్కమ్స్ టిప్స్ ఏంటో తెలుసుకోండి.
26
ఫ్రీలాన్సింగ్ ద్వారా సంపాదించండి
ఈ డిజిటల్ యుగంలో ఫ్రీలాన్సింగ్ ఒక గేమ్ ఛేంజర్. మీకు రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ లేదా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌లో స్కిల్స్ ఉంటే చాలు. Upwork, Fiverr, Freelancer వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చిన్న ప్రాజెక్టులతో మొదలుపెట్టి నెలకు వేలల్లో సంపాదించవచ్చు.
36
చిన్నచిన్న పెట్టుబడులతో ఆదాయం...
జీతం తక్కువగా ఉందని పెట్టుబడి పెట్టలేమని అనుకోవద్దు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్‌లో చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టండి. నెలకు కేవలం రూ.500-1000 ఇన్వెస్ట్ చేసినా, కొన్నేళ్లలో పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. అయితే కొన్నిరకాల పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి ఉంటాయి... కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఆఫీస్ తర్వాత మీకు ఖాళీ సమయం ఉంటే పార్ట్-టైమ్ జాబ్ చేయడం చాలా సులభం. ఆన్‌లైన్ ట్యూటరింగ్, కంటెంట్ రైటింగ్ లేదా లోకల్ డెలివరీ వంటి పనులు చేయొచ్చు. దీనివల్ల మీ నెలసరి ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది.
56
మీ హాబీని ఆదాయంగా మార్చుకొండి..
మీకు ఫోటోగ్రఫీ, పెయింటింగ్ లేదా బేకింగ్ వంటి వాటిలో నైపుణ్యం ఉందా? అయితే మీ ప్యాషన్‌నే ఆదాయంగా మార్చుకోండి. ఇన్‌స్టాగ్రామ్, Etsy లేదా స్థానిక మార్కెట్లలో మీ ఉత్పత్తులను అమ్మవచ్చు. మీ హాబీనే కెరీర్‌గా మార్చుకుని మంచి ఆదాయం పొందొచ్చు.
66
సోషల్ మీడియా నుండి ఆదాయం...
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు డబ్బు సంపాదించడానికి మంచి మార్గాలు. చిన్న వీడియోలు, రీల్స్ లేదా షార్ట్స్‌తో మొదలుపెట్టండి. కంటెంట్ క్రియేషన్‌లో కన్సిస్టెన్సీ పాటిస్తే నెలకు లక్షల్లో కూడా సంపాదించవచ్చు.
గమనిక : ఈ కథనం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇందులో చెప్పిన ఆదాయ మార్గాలు, చిట్కాలు కేవలం అంచనాలు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుడిని లేదా నిపుణులను సంప్రదించండి.