
Free Civils Coaching : చాలామంది యువతీయువకులు ఉన్నతమైన కలలు కంటుంటారు... కానీ వాటిని సాకారం చేసుకునేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. కొందరికి ఆర్థిక కష్టాలు, మరికొందరికి ఇంకేదో కష్టం... వీటన్నింటిని దాటుకుంటేనే కల నిజమయ్యేది. చిన్నచిన్న కలలు నెరవేర్చుకునేందుకే ఇబ్బందులు తప్పవు... అలాంటిది దేశంలోనే అత్యున్నతస్థాయి కలెక్టర్, ఎస్పీ వంటి ఉద్యోగాలను సాధించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్విసెస్ ఎగ్జామ్ లో ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు. అయితే సామాన్య, నిరుపేద విద్యార్థులు సరైన కోచింగ్ లేక, ఆర్థిక ఇబ్బందులతో సివిల్స్ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది... బిసి స్కడీ సర్కిల్స్ ద్వారా ఉచిత కోచింగ్ తో పాటు ఆర్థిక సాయం అందిస్తోంది.
తాజాగా యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027 కోసం సన్నద్దమయ్యే యువతీయువకుల ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మీరు అర్హులయితే ఫ్రీగా కోచింగ్, ఆర్థిక సాయం, ఇతర సదుపాయాలు పొందవచ్చు... ఏ ఇబ్బందులు లేకుండా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి మీ కలెక్టర్, పోలీస్ కలను నిజం చేసుకోవచ్చు.
తెలంగాణ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బిసి స్డడీ సర్కిల్స్ లో ఉచిత సివిల్స్ కోచింగ్ క్లాసులు వచ్చే నెల (ఆగస్ట్ 2026) లో ప్రారంభం కానున్నాయి. ఈ కోచింగ్ కోసం అర్హులైన యువతీయువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు... పూర్తి వివరాలతో జూలై 15న నోటిఫికేషన్ విడుదలయ్యింది.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17-07-2026
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : 07-08-2026
తెలంగాణ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ https://tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : 13-08-2026 నుంచి ప్రారంభం
స్క్రీనింగ్ టెస్ట్ : 16-08-2026
ఫలితాలు : 19-08-2026
ధ్రువపత్రాల పరిశీలన : 21-08-2026 నుంచి
సివిల్స్ కోచింగ్ తరగతుల ప్రారంభం : 24-08-2026
తెలంగాణ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TGBCESDTC) లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) –2027 ఉచిత శిక్షణ పొందాలనుకునే యువతీయువకులు హైదరాబాద్ లో ఉండాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈ కోచింగ్ 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు సాగుతుంది... సైదాబాద్ లోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో క్లాసులు నిర్వహిస్తారు.
ఒక్కో బ్యాచ్ లో మొత్తం 150 మంది అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ అందించనున్నారు. ఇందులో100 మందిని ఓపెన్ కేటగిరీ ద్వారా ఎంపికచేస్తారు... అంటే వీరికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మిగతా 50 మందిని ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తుంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్.
ఎంపికైన అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం
గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులకు : రూ.1.50 లక్షలలోపు
పట్టణ ప్రాంతాల అభ్యర్ధులకు : రూ.2.00 లక్షలలోపు
తప్పకుండా తెలంగాణ నివాసి అయి ఉండాలి.
భారతీయ పౌరుడై ఉండాలి.
ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.. అంటే నిరుద్యోగి అయివుండాలి.
ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొంది ఉండకూడదు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. మరి మీరు సివిల్ సర్విసెస్ ఎగ్జామ్-2027 కోసం సన్నద్దం అవుతుండి, అన్ని అర్హతలు కలిగివుంటే బిసి స్టడీ సర్కిల్ లో ఫ్రీగా కోచింగ్ పొందవచ్చు.
ఈ ఉచిత సివిల్స్ కోచింగ్ కు సంబంధించి మరింత సమాచారం కోసం ''టిజి బిసి స్టడి సర్కిల్, రోడ్ నెంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్-500059' కార్యాలయంలో సంప్రందించండి. లేదా ఫోన్ నెంబర్ 040-24071178 లేదా మొబైల్ ఫోన్ 7780359322 కు కాల్ చేయండి.