Blinkit: బ్లింకిట్‌లో ఎలా చేరాలి.? ఎవ‌రు అర్హులు.? నెల‌కు ఎంత సంపాదించొచ్చు.? పూర్తి వివ‌రాలు

Published : Jun 16, 2026, 02:44 PM IST

Blinkit: భారత్‌లో వేగంగా ఎదుగుతున్న క్విక్ కామర్స్ కంపెనీల్లో బ్లింకిట్‌ ఒకటి. దేశవ్యాప్తంగా వేలాది మంది ఇందులో డెలివరీ పార్ట్‌నర్లుగా పనిచేస్తున్నారు. మీరు కూడా బ్లింకిట్ డ్రైవ‌ర్ పాట్న‌ర్‌గా చేరాల‌నుకుంటే, కావాల్సిన అర్హ‌త‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
16
బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్‌గా చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు

బ్లింకిట్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేయడంలో ప్రధాన ప్రయోజనం పని సమయాల్లో ఉండే స్వేచ్ఛ. సాధారణ ఉద్యోగాల మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే షిఫ్ట్‌లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. మీకు అనుకూలమైన సమయాల్లో పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్‌గా పనిచేయవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు లేదా అదనపు ఆదాయం కోరుకునే వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

అలాగే Blinkit ప్రతి నెల జీతం ఇచ్చే విధానానికి బదులుగా వారానికోసారి చెల్లింపులు చేస్తుంది. దీంతో సంపాదించిన డబ్బు త్వరగా చేతికి అందుతుంది. ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు రక్షణగా ఉండేందుకు ప్రమాద భీమా, వైద్య భీమా వంటి సదుపాయాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్కువ డెలివరీలు పూర్తి చేసిన వారికి, ముఖ్యంగా రద్దీ సమయాల్లో పనిచేసిన వారికి అదనపు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి.

26
డెలివరీ పార్ట్‌నర్‌కు కావాల్సిన అర్హ‌త‌లు ఏంటి.?

బ్లింకిట్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా చేరేందుకు కొన్ని ప్రాథమిక అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. డెలివరీల కోసం సొంతంగా ద్విచక్ర వాహనం ఉండటం అవసరం. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. ఎందుకంటే అన్ని ఆర్డర్లు, డెలివరీ వివరాలు యాప్ ద్వారానే నిర్వ‌హిస్తారు. అదనంగా, చెల్లింపులు స్వీకరించేందుకు యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. డెలివరీ రంగంలో ముందస్తు అనుభవం లేకపోయినా ఎలాంటి సమస్య లేదు. కొత్తగా చేరిన వారికి Blinkit శిక్షణ అందిస్తుంది కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

36
రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు

Blinkit డెలివరీ పార్ట్‌నర్ రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించాలి. వీటిలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్‌, PAN కార్డు, ఆధార్ కార్డు ముఖ్యమైనవి. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఇవ్వాలి. ఈ పత్రాల ఆధారంగానే కంపెనీ మీ వివరాలను ధృవీకరిస్తుంది. అందువల్ల అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

46
రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఎలా ఉంటుంది.?

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా Blinkit Delivery Partner App ద్వారా జరుగుతుంది. ముందుగా Google Play Store లేదా Apple App Store నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి లొకేషన్, నోటిఫికేషన్ అనుమతులు ఇవ్వాలి. త‌ర్వాత మీకు అనుకూలమైన భాషను ఎంచుకుని మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేసి ధృవీకరణ పూర్తి చేయాలి.

తర్వాత మీరు ఉపయోగించబోయే వాహనం రకం, పని చేయాలనుకునే నగరం, పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ ఉద్యోగం వంటి వివరాలను నమోదు చేయాలి. అనంతరం డెలివరీలు చేయాలనుకునే స్టోర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ వివరాలన్నీ సమర్పించిన తర్వాత ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి.

56
వెరిఫికేషన్, శిక్షణ, ఉద్యోగ ప్రారంభం

రిజిస్ట్రేషన్ చివరి దశలో ఆధార్ OTP వెరిఫికేషన్, PAN కార్డు ధృవీకరణ, బ్యాంక్ ఖాతా నిర్ధారణ వంటి ప్రక్రియలు పూర్తవుతాయి. ఆ తర్వాత అభ్యర్థి స్పష్టమైన సెల్ఫీని అప్‌లోడ్ చేయాలి. కంపెనీ నిర్ణయించిన ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి నిబంధనలు, షరతులను అంగీకరించాలి.

అనంతరం వాహనం వివరాలు, నామినీ వివరాలు నమోదు చేసి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ శిక్షణలో డెలివరీ విధానం, యాప్ వినియోగం, చెల్లింపులు, ఇన్సెంటివ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. సాధారణంగా 3 నుంచి 6 గంటల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ గుర్తింపు కార్డుతో స్టోర్ మేనేజర్ వద్ద ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేయించుకున్న వెంటనే డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేయడం ప్రారంభించవచ్చు.

66
ఆదాయం ఎంత ఉంటుంది?

Blinkit డెలివరీ పార్ట్‌నర్ ఆదాయం వారు పనిచేసే సమయం, డెలివరీ చేసిన ఆర్డర్ల సంఖ్య, డెలివరీ దూరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆర్డర్‌కు చెల్లింపు లభించడంతో పాటు రద్దీ సమయాల్లో పనిచేసిన వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా అందుతాయి. కంపెనీ వారానికోసారి చెల్లింపులు చేస్తుంది. అందువల్ల నిరంతరం పని చేసే వారికి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సాధార‌ణంగా ఒక డెలివ‌రీ పాట్న‌ర్ రోజులో క‌నీసం రూ. 500 సంపాదించొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories