మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు లేవా? అయినా గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు!

Published : May 13, 2025, 08:01 PM IST

UPI New Credit Line Facility: అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేయలేం కదా.. కాని NPCI ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఉపయోగించుకొని గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేయొచ్చు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
15
మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు లేవా? అయినా గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు!

ఇది డిజిటల్ లావాదేవీల యుగం. ఏం కొనాలన్నా లిక్విడ్ క్యాష్ అవసరం లేదు. జస్ట్ డిజిటల్ మనీ ఉంటే చాలు. అంటే అకౌంట్ లో డబ్బులుంటే చాలు. దాన్ని డ్రా చేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది UPIని ఉపయోగిస్తున్నారు. అంటే Google Pay, Paytm, PhonePe, BHIM యాప్‌ల ద్వారా UPI లావాదేవీలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయినా UPI లావాదేవీ చేయవచ్చు. NPCI ఈ ప్రత్యేక సేవను ప్రవేశపెట్టింది.

25

సాధారణంగా ప్రతి ఒక్కరి UPI ID వారి బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయబడి ఉంటుంది. పేమెంట్స్ చేసినప్పుడు మీ అకౌంట్ నుండి డబ్బు డెబిట్ అవుతుంది. ఇప్పుడు NPCI ఒక అద్భుతమైన సేవను ప్రవేశపెట్టింది. మీ అకౌంట్ లో డబ్బు లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

35

క్రెడిట్ కార్డు లాంటి సౌకర్యం

UPI క్రెడిట్ సౌకర్యం క్రెడిట్ కార్డ్ లాంటిది. అంటే ప్రతి కస్టమర్‌కు ఒక నిర్దిష్టమైన లిమిట్ ఇస్తారు. ఈ సౌకర్యం మీరు పొందాలని అనుకుంటే మీ బ్యాంకుకు వెళ్లి UPI IDకి క్రెడిట్ కావాలని దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ముందు కచ్చితంగా ఈ అకౌంట్ మీ UPI IDతో లింకై ఉండాలి.

45

45 రోజుల్లో తిరిగి చెల్లించాలి

బ్యాంక్ నుండి ఆమోదం పొందిన తర్వాత మీ ఖాతాలో డబ్బు ఉన్నా లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ డబ్బును తిరిగి చెల్లించడానికి మీకు 45 రోజుల గడువు ఉంటుంది. బ్యాంక్ ఎలాంటి వడ్డీ వసూలు చేయదు. 45 రోజుల్లోపు మీరు డబ్బు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాలి. ప్రస్తుతం ఈ సేవ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ప్రారంభమైంది. 

55

డబ్బుల్లేకపోయినా కొనుగోలు చేయవచ్చు

BHIM, Paytm, PayZapp, G Payలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం వల్ల మరిన్ని లావాదేవీలు జరుగుతాయని కేంద్రప్రభుత్వం ఆశిస్తోంది. ఇకపై ఏదైనా కొనుగోలు చేసే ముందు చింతించాల్సిన అవసరం లేదు. బ్యాంకులో డబ్బు లేకపోయినా హాయిగా కొనుగోలు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories