చిన్న కార్లలో కూడా సేఫ్టీ ఎక్కువే: 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న మారుతి సుజుకి కార్లు ఇవే

Published : May 13, 2025, 06:57 PM IST

Maruti Suzuki: దేశంలో టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో మారుతి సుజుకి ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ కార్ల భద్రతపై మరింత దృష్టి సారించింది. ఇకపై చిన్న కార్లలో కూడా 5 కీలకమైన భద్రతా ఫీచర్లను అందిస్తామని ప్రకటించింది. ఆ మోడల్స్, ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

PREV
15
చిన్న కార్లలో కూడా సేఫ్టీ ఎక్కువే: 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న మారుతి సుజుకి కార్లు ఇవే

కారు కొనేటప్పుడు ముందుగా చూసేది సేఫ్టీయే కదా.. ఇంతకు ముందు వరకు పెద్ద కార్లలోనే సేఫ్టీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి చిన్న కారులోనూ సేఫ్టీ ఫీచర్స్ కే ముందు ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ రూల్స్ ని కచ్చితంగా అమలు చేసే కంపెనీల్లో మారుతి సుజుకి ముందుంటుంది. ఈ కంపెనీకి చెందిన చిన్న కార్లలో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి 5 ఇంపార్టెంట్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆ మోడల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

25

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు కారు కంపెనీలన్నీ సేఫ్టీ ఫీచర్స్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాయి. అంటే మీరు కారు బేస్ మోడల్‌ను కొన్నా మీకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. కారు భద్రతా ఫీచర్లలో ఇది ఒక ముఖ్యమైన ఫీచర్ గా మారుతోంది. దేశంలో కార్ల భద్రతపై పెరుగుతున్న అవగాహనకు ఇది ఒక నిదర్శనం.

మార్కెట్లో నిలదొక్కుకోవడానికి, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారడానికి మారుతి సుజుకి కంపెనీ కట్టుబడి ఉందని కార్ల మోడల్స్ లో వస్తున్న మార్పులను బట్టి తెలుస్తోంది.

35

భద్రతా ఫీచర్ల పెంపు

భారతదేశంలో ప్రభుత్వాలు హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు వేగంగా నిర్మిస్తున్న నేపథ్యంలో కార్లలో గతంలో కంటే ఎక్కువ భద్రతా చర్యలు అవసరం అవుతాయి. అందువల్ల మారుతి సుజుకి వాగన్ఆర్, ఆల్టో K10, సెలెరియో, ఈకో వంటి వాటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలని కంపెనీ నిర్ణయించింది.

45

మారుతి కార్ల ఎయిర్‌బ్యాగ్ సౌకర్యాలు

వాగన్ఆర్, ఆల్టో K10, సెలెరియో, ఈకో వంటి మోడళ్లను అరీనా నెట్‌వర్క్ ద్వారా కంపెనీ విక్రయిస్తుంది. అదే సమయంలో నెక్సా నెట్‌వర్క్ ద్వారా బలెనో, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లను విక్రయిస్తుంది. నెక్సా బ్రాండ్‌లో అమ్ముడవుతున్న చాలా మోడళ్లలో ఇప్పటికే 6 ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం ఉంది.

55

5 కీలక భద్రతా ఫీచర్లు

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు రావడంతో మారుతి సుజుకి కార్లలో 5 ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉంటాయి. అవి ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), హిల్ హోల్డ్ అసిస్ట్. ఇవి కాకుండా 3 పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు కూడా మారుతి కార్లలో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories