యూట్యూబ్‌లో సూపర్ ఫీచర్: ఇకపై మీకు నచ్చిన వీడియోని ఏ భాషలోనైనా చూడొచ్చు

Published : Jan 22, 2025, 01:22 PM IST

యూట్యూబ్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై మనకు నచ్చిన వీడియోను ఏ భాషలోనైనా చూడొచ్చు. వినొచ్చు. అదెలాగో వివరంగా తెలుసుకుందాం రండి.  

PREV
15
యూట్యూబ్‌లో సూపర్ ఫీచర్: ఇకపై మీకు నచ్చిన వీడియోని ఏ భాషలోనైనా చూడొచ్చు

ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే సోషల్ మీడియా యాప్ ఏంటంటే డౌట్ లేకుండా యూట్యూబ్ అని చెప్పొచ్చు. ఈ యాప్ అంత పాపులర్ అయిపోయింది. సాధారణంగా ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం. అదే సమాచారం వీడియో రూపంలో కావాలంటే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం.
 

25

గూగుల్ వచ్చిన కొత్తలో ప్రతి ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్, ఆర్టికల్స్ రూపంలో లభించేవి. కంటెంట్ రైటర్స్ కూడా సమాచారాన్ని, వార్తలను ఆర్టికల్స్ రూపంలోనే అందించే వారు. కాని యూట్యూబ్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది ప్రతి సమాచారాన్ని వీడియోల రూపంలో తయారు చేస్తున్నారు. అందుకు యూట్యూబ్ కు అంత క్రేజ్ వచ్చింది. 
 

35

ఇప్పుడు యూట్యూబ్ వినియోగదారులకు సూపర్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఏ భాషలో ఉన్న వీడియోనైనా మనకు నచ్చిన భాషలో చూడొచ్చు. అయితే ఈ పని కంటెంట్ రైటర్స్ చేయాల్సి ఉంటుంది. వీడియోలు క్రియేట్ చేసే కంటెంట్ రైటర్స్ తమ వీడియోలు తయారు చేసేటప్పుడు ‘ఆటో డబ్బింగ్’ఆప్షన్ ఉపయోగిస్తే వారి వీడియో ఆటోమెటిక్ గా ఇతర భాషల్లోకి డబ్ అవుతుంది. 
 

45

ఆటో డబ్బింగ్ ఆప్షన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఆధారంగా పనిచేస్తుంది. కంటెంట్ రైటర్స్ తమ వీడియోలు తయారు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నప్పుడు ఆటో డబ్బింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఆ వీడియో ఇతర భాషల్లోకి కూడా డబ్ అవుతుంది. దీని వల్ల ఆ వీడియోని వేరే భాషల వాళ్లు కూడా వారి భాషలో చూడొచ్చు. 
 

55

ఈ ఆటో డబ్బింగ్ ఆప్షన్ వల్ల కంటెంట్ రైటర్స్ కి యూజర్స్, వ్యూస్ పెరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ భాషల్లో ఆటోమెటిక్ గా డబ్ అవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా  వారి వీడియోలు చూస్తారు. అందువల్ల కంటెంట్ రైటర్స్ కి ఈ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ యూజర్స్ కి కూడా వేరే భాషల వీడియోలు వారికి నచ్చిన భాషలో చూడటం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. 

click me!

Recommended Stories