జంప్ డిపాజిట్ మోసం నుంచి జాగ్రత్తగా ఉండండి: ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి

Published : Jan 21, 2025, 05:55 PM IST

రోజుకో కొత్త రకం సైబర్ మోసాలు బయటపడుతున్నాయి. ఓటీపీ మోసాలు, ఏటీఎం స్కామ్ లు, పాస్ వర్డ్స్ తెలుసుకొని డబ్బులు దోచేయడం లాంటి వాటి గురించి ఇప్పటి వరకు విన్నాం. ఇలాంటిదే ఇటీవల ‘జంప్ డిపాజిట్’ స్కామ్ పేరుతో మోసాలు వెలుగు చూస్తున్నాయి. అయితే UPI ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఇలాంటి స్కామ్స్ జరగవని UPI చెబుతోంది. ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో UPI కొన్ని సూచనలు చేసింది. అవేంటో తెలుసుకుందాం.   

PREV
15
జంప్ డిపాజిట్ మోసం నుంచి జాగ్రత్తగా ఉండండి: ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి

UPI ద్వారా పేమెంట్స్ చేయడం వల్ల చెల్లింపులు చాలా సింపుల్ అయ్యాయి. వేగవంతమైన లావాదేవీల వల్ల UPI బాగా ప్రజాదరణ పొందింది. UPI యాప్ లో మొబైల్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ మధ్య వెంటనే డబ్బు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అయితే ఇటీవల వెలుగుచూస్తున్న సైబర్ నేరాలు మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 'జంప్ డిపాజిట్' మోసం గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోవడంతో ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయి. 

జంప్ డిపాజిట్ మోసం ఎలా చేస్తారు. దీని బారిన పడకుండా ఉండాలంటే UPI యాప్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. 

25

జంప్ డిపాజిట్ స్కామ్‌ ఎలా జరుగుతుందంటే. గుర్తు తెలియని వ్యక్తి మీ యూపీఐ అకౌంట్ కి కొంత మొత్తంలో డబ్బులు పంపిస్తారు. దీంతో బ్యాలెన్స్‌ చెక్‌ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్‌ లింక్‌లను పంపిస్తున్నారు. దీంతో పిన్‌ ఎంటర్‌ చేయగానే మీ ఖాతాలోని డబ్బు వేరే వాళ్ల అకౌంట్‌లోకి వెళ్లిపోతుంది. 

ఇలా మీకెప్పుడైనా జరిగితే వెంటనే 1930 నెంబర్‌కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి. సంఘటన జరిగిన రెండు గంటల్లోపు ఫిర్యాదు చేస్తే అధికారులు మీ అమౌంట్‌ను ఫ్రీజ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. 

35

డిజిటల్ మోసగాళ్ళు వినియోగదారుల అకౌంట్స్ కి కొంచెం డబ్బును డిపాజిట్ చేస్తారు. దీని ద్వారా పెద్ద మొత్తంలో అమౌంట్ దొంగిలించేందుకు లింక్స్ పంపిస్తారు. పొరపాటున వాటిని క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది.

ఈ డిజిటల్ మోసాలపై వినియోగదారుల్లో ఆందోళనలను పెరుగుతుండటంతో NPCI స్పందించింది. UPIలో ఇలాంటి మోసాలు లేవని స్పష్టం చేసింది. UPI పిన్ లేకుండా లావాదేవీలు జరగవని NPCI తెలిపింది. లావాదేవీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని సూచించింది.

45

UPI ద్వారా మోసాలు జరగడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే..

1. UPI లావాదేవీలు చేసేటప్పుడు పిన్ కచ్చితంగా ఉపయోగించాలి. ఇతరులు మీ పిన్ తెలుసుకొంటేనే మోసాలు జరుగుతాయి. ఇంత ముఖ్యమైన పిన్ ను ఎవరితోనూ షేర్ చేయకండి.

2. UPI వినియోగదారుని బ్యాంక్ అకౌంట్ ను వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో పాటు మొబైల్ డివైస్ తో లింక్ చేస్తుంది. అందువల్ల స్కామ్ జరగడానికి మాక్సిమం ఛాన్స్ ఉండదు. 

3. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా UPI పిన్ అవసరం. ఇది ఇతరులు మీ అకౌంట్స్ యాక్సెస్‌ చేయకుండా నిరోధిస్తుంది.

55

జంప్ డిపాజిట్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి

1. అధికారిక యాప్‌లను ఉపయోగించండి. Google Play Store లేదా Apple App Store వంటి విశ్వసనీయ వనరుల నుండి UPI యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.

2. అప్‌డేట్‌గా ఉండండి. తాజా మోసాలు ,భద్రతా చిట్కాల గురించి తెలుసుకోండి.

3. UPI డిజిటల్ లావాదేవీలకు సురక్షితమైన, నమ్మకమైన వేదిక. సిఫార్సు చేసిన భద్రతా పద్ధతులను పాటిస్తే జంప్ డిపాజిట్ మోసం UPIలో జరగదు. 

click me!

Recommended Stories