యమహా ప్రియులకు గుడ్ న్యూస్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను సిద్ధం చేస్తున్న యమహా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

Published : May 18, 2025, 06:47 PM IST

Yamaha: యమహా.. ఈ పేరంటే 90లలో యూత్ కి యమా క్రేజ్. ప్రత్యేకమైన బీటింగ్ ద్వారా అప్పట్లో ద్విచక్ర వాహన రంగంలో ఒక సంచలనే క్రియేట్ చేసింది. ఈ తరం యూత్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి మళ్లీ మార్కెట్లోకి వచ్చేస్తోంది. అయితే ఈ సారి ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో రానుంది. యమహా రీలాంచింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? 

PREV
15
యమహా ప్రియులకు గుడ్ న్యూస్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను సిద్ధం చేస్తున్న యమహా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అందుకే యమహా కంపెనీ కూడా త్వరలోనే ఈ రంగంలోకి అడుగుపెట్టనుంది. బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ రివర్‌తో కలిసి తన మొదటి గ్లోబల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యమహా తయారు చేస్తోందని ఒక నివేదిక వెల్లడించింది. తెలిసిన సమాచారం ప్రకారం RY01 అనే పేరుతో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారవుతుంది.

25

యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏముంటాయి? 

ఆటోకార్ ఇండియా సమాచారం ప్రకారం బ్యాటరీతో నడిచే యమహా స్కూటర్ ప్రొడక్షన్ జూలై, సెప్టెంబర్ 2025 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం చివరిలోనే యమహా మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ స్కూటర్‌ను ప్రస్తుతం జపాన్, యుఎస్, యూరప్‌లోని యమహా యొక్క గ్లోబల్ ఇంజనీరింగ్ బృందాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఇండియాలో బెంగళూరులో రివర్ ఇండి కంపెనీతో కలిసి యమహా కంపెనీ అభివృద్ధి చేస్తోంది.

35

ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై బ్యాటరీతో నడిచే స్కూటర్‌ను నిర్మించడం వల్ల యమహాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీ ఖర్చు తక్కువ. ఇండియాలో రివర్ కంపెనీతో కలిసి తయారు చేస్తుండటంతో మార్కెటింగ్ వేగంగా సాగుతుంది. భారతదేశం ప్రధానంగా బడ్జెట్ ఆధారిత మార్కెట్ కాబట్టి యమహా క్రేజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్ గా దాని ధర మార్కెట్ లో యమహాను ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలి.

45

రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంటిదే.. కాని..

యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్ ఇండి లాగానే అదే కోర్ ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రెయిన్, BMSలతో తయారవుతుంది. అయితే ఇది యమహా స్పోర్టి ఐడెంటిటీకి దగ్గరగా ఉండే ప్రత్యేకమైన డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. దీనికి RY01 అనే పేరును నిర్ణయించనున్నట్లు కూడా తెలుస్తోంది. 

55

రివర్ ఇండికి చాలా భిన్నంగా టాప్ హాట్ ఉంటుందని సమాచారం. కాబట్టి రాబోయే ఇ-స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే వరకు పూర్తి రూపాన్ని కరెక్ట్ గా ఊహించలేం. అయితే ఇది ఇండి కంపెనీ స్కూటర్ లాంటి  స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని మాత్రం తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories