అయితే మనకు డబ్బు నేరుగా ఇవ్వాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. దానధర్మాలు చేయడానికి, పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి, బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయడానికి ఇలా చాలా సందర్భాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో డబ్బులు డ్రా చేయడానికి ATMల దగ్గరకు వెళ్లాలి. డెబిట్ కార్డు పెట్టి అవసరమైన డబ్బు విత్ డ్రా చేసుకోవాలి.
అయితే డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీ డెబిట్ కార్డు మర్చిపోయినా ఏం పర్వాలేదు. మీ ఆధార్ కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. వినియోగదారుల సౌకర్యం కోసం NPCI(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) AEPS(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా మీరు మీ ఆధార్ కార్డుని ఉపయోగించి డబ్బులు డ్రా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.