Gold Rate: గోల్డ్ ధర అకస్మాత్తుగా ఎందుకలా పడిపోతోంది? మళ్లీ ఎన్నిరోజుల్లో పెరుగుతుంది?

Published : Mar 23, 2026, 02:03 PM IST

Gold Rate: బంగారం ధరలో అకస్మాత్తుగా తగ్గడం చూస్తూనే ఉన్నాము. ఇలా తగ్గుతున్న బంగారు ధరలు ఇంకా తగ్గుతాయా? లేక మళ్ళీ ఒకేసారి పెరుగుతాయా? ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోండి 

PREV
14
బంగారం ధరలు

గత వారం వరకు బంగారం ధరలు పెరుగుతూ భయపెట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం బంగారం ధరలు అకస్మాత్తుగా తగ్గిపోతూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా కూడా యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఉంటే చాలు కచ్చితంగా బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో గోల్డ్ ధరలు తగ్గిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడైతే బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయో.. దానిపై భారీగా పెట్టుబడులు పెట్టిన వారు కాస్త కంగారు పడుతున్నారు. ఈ బంగారం ధరలు ఇలా తగ్గుతూనే ఉంటాయా? లేక ఉద్రిక్త వాతావరణం, యుద్ధం అన్ని ముగిసిపోయాక మళ్ళీ పెరుగుతాయా? అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.

24
ఎందుకు గోల్డ్ రేట్ తగ్గింది?

ఇటీవల చూసుకుంటే గోల్డ్ ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలపడడం. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్ లో ట్రేడ్ అవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులు బంగారం కంటే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు వంటి వడ్డీ వచ్చే ఆస్తులను కొనేందుకే ఇష్టపడతారు. దీని వల్ల కూడా బంగారం ధరలు తగ్గాయని భావించవచ్చు.

34
కొనాలా? అమ్మాలా?

అలాగని బంగారం ధరలు తగ్గడం చూసి వెంటనే సంతోషించకూడదు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న ఉద్రిక్త వాతావరణం మారితే పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ గోల్డ్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలా? అమ్మాలా? అనే ప్రశ్న చాలా మందికి ఉంది. దీనిపై ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించమని సూచిస్తున్నారు. హఠాత్తుగా పెద్ద మొత్తంలో బంగారం కొనడం లేదా బంగారం అమ్మేయడం రెండూ మంచిది కాదని చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ చిన్న చిన్న మొత్తాల్లోని ఇన్వెస్ట్ చేయడం లేదా చిన్న చిన్నగానే అవసరానికి తగ్గట్టే అమ్మడం మంచివి చేయడం ఉత్తమం.

44
మార్కెట్ ట్రెండ్ ను బట్టి

అమెరికా ఫెడరేషన్ తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ మార్పులు, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఉద్రిక్త వాతావరణం ఇవన్నీ కూడా గోల్డ్ ధరలపై ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం కొంచెం బలహీన దశలోనే ఉంది. అయితే దీర్ఘకాలంలో అలాగే ఉంటుందని చెప్పలేము. తాత్కాలికంగా ధరలు తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరగవచ్చు. కాబట్టి మార్కెట్ ట్రెండ్ అర్థం చేసుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories