హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత?
చాలాకాలంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇటీవలకాలంలో పెరిగుతున్నంత వేగంగా ఎప్పుడూ పెరగలేవు. రోజురోజుకు పదులు, వందల్లో కాదు ఏకంగా వేలల్లో బంగారం ధర పెరుగుతోంది. ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువయ్యింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.97,310 ధర పలుకుతోంది. నిన్న రూ.990 పెరగగా ఇవాళ ఏకంగా రూ.1140 పెరిగింది. ఇదే పెరుగుదల కొనసాగితే ఈ నెలాఖరుకు తులం బంగారం ధర లక్ష దాటుతుంది.
ఇదిలావుంటే 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.89,200 గా ఉంది. ఇది గురువారం రూ.950, శుక్రవారం రూ.1050 పెరిగింది. ఇలా బంగారం ధరలు అమాంతం పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశంలో పెరిగిన కొనుగోళ్లు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్ కావడంతో బంగారంకు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది.