తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

UPI: ఫోన్‌పేలో యూపీఐ సర్కిల్‌ ఫీచర్‌.. ఏంటిది? ఎలా ఉపయోగపడుతుంది.?

Narender Vaitla | Published : Apr 17, 2025 5:15 PM

దేశంలో రోజురోజుకీ యూపీఐ సేవలు విస్తరిస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ కూడా తక్కువ ధరకే లభిస్తుండడంతో యూపీఐ సేవల విస్తృతి పెరిగింది. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా యూపీఐ పేమెంట్స్‌ యాప్‌లో రకరకాల ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల యూపీఐ సర్కిల్‌ పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ ఫీచర్‌.? దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

14
UPI: ఫోన్‌పేలో యూపీఐ సర్కిల్‌ ఫీచర్‌.. ఏంటిది? ఎలా ఉపయోగపడుతుంది.?

యూపీఐ సేవలు వినియోగించుకోవాలంటే కచ్చితంగా బ్యాంకు అకౌంట్‌ ఉండాలనే విషయం తెలిసిందే. అయితే బ్యాంక్‌ అకౌంట్‌ లేని చిన్న పిల్లలతో పాటు ఇతరులు యూపీఐ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ యూపీఐ సర్కిల్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు ఇప్పటికే ఈ ఫీచర్‌ గూగుల్‌ పేలో అందుబాటులోకి వచచింది. అయితే తాజాగా దీనిని ఫోన్‌పేలో కూడా తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో తమ యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయం కల్పిస్తోంది.
 

24

ఇందులో ఒక వ్యక్తి తన కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో వ్యక్తులను వారి యూపీఐ ఐడీ లేదా క్యూఆర్‌ కోడ్‌తో తన సర్కిల్‌లో యాడ్‌ చేయొచ్చు. దీంతో ప్రైమరీ వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి సర్కిల్‌లో యాడ్‌ చేసిన వ్యక్తులు లావాదేవీలు చేసుకోవచ్చన్నమాట. సెకండరీ యూజర్‌ చేసే ట్రాన్సాక్షన్స్‌ అన్ని ప్రైమరీ యూజర్‌ కంట్రోల్‌లోనే జరుగుతున్నాయి. అవసరైతే సర్కిల్‌ నుంచి యాక్సెస్‌ను డీలింక చేసుకోవచ్చు, లావాదేవీలు ఎంత చేయాలన్న దానిపై కూడా నియంత్రణ పెట్టొచ్చు. 
 

34

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలంటే.? 

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో ఫోన్‌పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 

* అనంతరం కిందికి స్క్రోల్‌ చేస్తే కనిపిచే 'మేనేజ్‌ పేమెంట్స్‌' అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* అందులో కనిపించే 'యూపీఐ సర్కిల్‌' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
 

44

* ఆ తర్వాత సెకండరీ కాంటాక్ట్‌ ఆప్షన్‌ కింద 'ఇన్‌వైట్‌ ఏ రిక్వెస్టర్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

* చివరిగా సెకండరీ యూజర్‌కి చెందిన యూపీఐ ఐడీ లేదా క్యూఆర్‌ కోడ్‌ సాయంతో రిక్వెస్ట్‌ పంపాలి.

* ఆ రిక్వెస్ట్‌ను సెకండరీ యూజర్‌ యాక్సెప్ట్‌ చేస్తే చాలు. దీంతో ప్రైమరీ యూజర్‌ అకౌంట్‌ నుంచి సెకండరీ యూజర్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు.   

Read more Photos on
click me!
Recommended Photos