Recharge plan: రూ. 26తో రీఛార్జ్‌ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటంటే

Published : Apr 17, 2025, 04:09 PM IST

టెలికం రంగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో రకరకాల ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి కంపెనీలు. ముఖ్యంగా ఇటీవల కంపెనీలు టారిఫ్‌లను పెంచిన తరుణంలో యూజర్లు చేజారిపోకుండా చూసుకుంటున్నాయి. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది రిలయన్స్‌ జియో. యూజర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ప్లాన్స్‌ను తీసుకొస్తున్న జియో. తాజాగా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Recharge plan: రూ. 26తో రీఛార్జ్‌ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటంటే

స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే స్థోమత లేని వారికి దాదాపు స్మార్ట్ ఫోన్‌లో ఉన్న అన్ని ఫీచర్లను అందిస్తూ రిలయన్స్‌ జియో సంస్థ జియో ఫోన్ పేరుతో ఫోన్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌ కేవలం రూ. 26 కావడం విశేషం. 
 

24

రూ. 26తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ చౌక ప్లాన్‌ కేవలం జియో ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రిపెయిడ్ యూజర్ల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 2 జీబీ హై స్పీడ్‌ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కేవలం ఇంటర్నెట్ డేటా మాత్రమే లభిస్తుంది. అయితే దీనికి 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ 2 జీబీ డేటా పూర్తయితే ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కి తగ్గిపోతుంది. 
 

34

యూపీఐ పేమెంట్స్‌, వాట్సాప్‌ వంటి చిన్న చిన్న పనులకు జియో ఫోన్‌లను ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌ను యూజర్లు జియో.కామ్‌ లేదా జియో యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. బేస్‌ ప్లాన్‌ ఉండి డేటా అయిపోతే ఈ డేటా ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి రీఛార్జ్‌ ప్లాన్‌ జియోలో మాత్రమే కాదు ఇతర ఆపరేటర్లు కూడా అందిస్తున్నారు.  
 

44

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, Vi లు రూ.26 చౌకైన ప్లాన్‌ను అందిస్తున్నాయి. అయితే ఇందులో 1.5 జీబీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటా లభిస్తుంది. అలాగే వ్యాలిడిటీ కూడా కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories